Harish Rao on Cong Govt: గ్రామాల్లో కాంగ్రెస్‌ను నిలదీయండి: హరీశ్
Harish Rao on Cong Govt (Image Source: Twitter)
Telangana News

Harish Rao on Cong Govt: గ్రామాల్లో కాంగ్రెస్‌ను నిలదీయండి.. ఆరు గ్యారంటీలపై ప్రశ్నించండి.. హరీశ్ రావు

Harish Rao on Cong Govt: బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి హరీశ్ రావు మరోమారు కాంగ్రెస్ పార్టీ (Congress) పై విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ నేతలను గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రశ్నించాలని సూచించారు. ఆరు గ్యారంటీల అమలు చేయకుండా ఎన్నికల్లో ఓటు ఏవిధంగా అడుగుతున్నారని నిలదీయాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కేసీఆర్ (KCR) నాయకత్వాన్ని బలపరుస్తూ అందరం కలిసి కట్టుగా పనిచేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు హరీశ్ రావు సూచించారు.

అంతకుముందు మాజీ మంత్రి హరీశ్ రావును కలిసిన నర్సాపుర్ నియోజక వర్గ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు.. ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. వారందరిని పార్టీ కండువా కప్పి హరీశ్ రావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎగిరేది గులాబీ జెండానని స్పష్టం చేశారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అందరం కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు.

Also Read: Etela Rajender: కాంగ్రెస్ పాలనపై గ్రామాల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

అబద్ధపు హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ (Congress)కు, తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీ (BJP)కి రాబోయే స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో మాజీ జడ్పీటీసీ అమర్ సింగ్ తో పాటు 50 మంది కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు ఉన్నారు.

Also Read: Yuva Sarpanch: నామినేషన్ రెండో రోజే ఎన్నిక ఏకగ్రీవం.. సర్పంచ్‌గా 24 ఏళ్ల కుర్రాడు

Just In

01

RTC Officer Died: ఆర్‌టీసీ డిప్యూటీ ఆర్‌ఎం వెంకట్ రెడ్డి పాడె మోసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

Naini Coal Block: బొగ్గు బ్లాక్ టెండర్లపై ఆరోపణల వేళ.. మాజీ మంత్రి హరీష్ రావు హాట్ హాట్ కామెంట్స్

Anasuya Bharadwaj: హత్యాచారం చేసిన వారికి మరణశిక్ష బిల్‌.. అనసూయ షాకింగ్ పోస్ట్!

Substandard Bridge: నాసిరకం బ్రిడ్జిను నిర్మిస్తున్న కాంట్రాక్టర్.. బయటపడ్డ బండారం.. ఫొటో ఇదిగో

Political News: ఇవి బురద రాజకీయాలు.. వైసీపీ, బీఆర్ఎస్‌లపై టీడీపీ ఎంపీ ఫైర్