CM-Sidda-Ramaiah (Image source Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Siddaramaiah Son: ఏం జరగబోతోంది?.. సీఎం సిద్దరామయ్య కొడుకు షాకింగ్ కామెంట్స్!

Siddaramaiah Son: కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర (MLC) చేసిన వ్యాఖ్యలు (Siddaramaiah Son) అక్కడి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన తండ్రి సిద్ధరామయ్య రాజకీయ జీవితంలో తుది దశలో ఉన్నారని వ్యాఖ్యానించారు. సిద్ధరామయ్య మంత్రివర్గ సహచరుడిగా ఉన్న సతీష్ జార్కిహోళికి ఇకపై మార్గదర్శకంగా ఉండాలని, తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. బెళగావిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కర్ణాటక కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. యతీంద్ర మాట్లాడుతూ, తన తండ్రి రాజకీయ జీవితంలో ముగింపు దశలో ఉందని అన్నారు. ఈ దశలో బలమైన సిద్ధాంతం, ప్రగతిశీల ఆలోచన కలిగిన నేత అవసరమని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీని సమర్థవంతంగా నడిపించగలిగే వ్యక్తి జార్కిహోళి అని పేర్కొన్నారు. ఇంతటి దృఢమైన సిద్ధాంతాన్ని అనుసరించే నాయకుడిని గుర్తించడం అరుదని తాను గట్టిగా నమ్ముతున్నానని యతీంద్ర అన్నారు. తన తండ్రి మంచి పనులను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.

Read Also- China CR450 Train: వరల్డ్ రైల్వే టెక్నాలజీలో చైనా సంచలనం.. ఊహించని వేగంతో ట్రైన్

డీకే శివకుమార్‌కు సీఎం పదవి ఇస్తారా?

యతీంద్ర వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి సీఎం మార్పు వ్యవహారంపై చర్చ ఊపందుకుంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎప్పటినుంచో ఆశిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై అధిష్టానం నుంచి ఇంతవరకు ఎలాంటి సంకేతాలు లేవు. గత నెలలో కూడా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు బాధ్యతలు అప్పగిస్తారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలను స్వయంగా సిద్ధరామయ్యే ఖండించి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ ఎల్ఆర్ శివరామే గౌడ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఊహాగానాలకు ఆజ్యం పోశాయి.

Read Also- Lightning Strikes: పొలం పనులు చేస్తుండగా.. కూలీ కుటుంబాల్లో పిడుగుపాటు విషాదం

డీకే శివకుమార్ సీఎం అవుతారనే విషయంలో ఎలాంటి సందేహం లేదని, అయితే, తుది నిర్ణయం మాత్రం హైకమాండ్‌దేనని ఎంపీ శివరామే గౌడ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మధ్య ఎలా బ్యాలెన్స్ చేయాలో వారికి తెలుసునని, కష్టానికి ఎప్పుడూ ఫలితం లభిస్తుందని ఆయన గౌడ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల అనంతరం సిద్ధరామయ్య స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను పూర్తిగా ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతున్నానని విలేకరులకు స్పష్టం చేశారు. పార్టీ తరపున ఎన్నిసార్లు ఖండించినా ప్రచారం ఆపడంలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, కర్ణాటక కాంగ్రెస్‌లో రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం సిద్ధరామయ్యకు మద్దతు ఇస్తుండగా, మరొక వర్గం డీకే శివకుమార్‌కు అండగా నిలుస్తోంది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రిగా ఉన్న సతీష్ జార్కిహోళి, సిద్ధరామయ్య వర్గంలో బలమైన నేతగా ఉన్నారు. అందుకే, సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర మాట్లాడుతూ, జార్కిహోళి మార్గదర్శకత్వం చేయాలంటూ కోరారు. ఈ పరిణామం రాజకీయ పరిశీలకులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే, ఇదొక వ్యూహాత్మక చర్య కావొచ్చనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. సిద్ధరామయ్య వర్గంలోనే ఉంటుందనే సంకేతాన్ని డీకే శివకుమార్‌‌కు, ఆయన అనుచరులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Just In

01

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

Intermediate Exams: ఈసారి ఇంటర్ పరీక్షలు యథాతథం.. వచ్చే సంవత్సరం నుంచి మార్పులు

Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..