IndiGo Crisis: ఇండిగో ఎదుర్కొంటున్న కార్యకలాపాల అంతరాయాలు మరింత తీవ్రమవుతున్నాయి. పలు మీడియా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లో నేడు దాదాపు 220 విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఈ నేపథ్యంలో విమాన రవాణా మార్కెట్‌లో సామర్థ్య లోటు తలెత్తకుండానే, స్పైస్‌జెట్ ప్రస్తుత వింటర్ షెడ్యూల్‌లో రోజుకు అదనంగా 100 ఫ్లైట్లు జోడించేందుకు నిర్ణయించింది.
ఇండిగో కార్యకలాపాల్లో అంతరాయం ఎనిమిదో రోజుకూ చేరింది. భారీ రద్దులు, ఆలస్యాలు, కార్యకలాప లోపాలను ఎదుర్కొన్న airline, 8 డిసెంబరు నాటికి తమ నెట్‌వర్క్ పూర్తిగా పునరుద్ధరించామని, 90% ఆన్-టైమ్ పనితీరు సాధించామని ప్రకటించింది. అయితే, దీనికి విరుద్ధంగా బెంగళూరు, ముంబై, హైదరాబాద్ విమానాశ్రయాలు మంగళవారం 200కి పైగా ఫ్లైట్ అంతరాయాలను నమోదు చేశాయి.
ఈ పరిస్థితుల్లో DGCA డీజీసీఏ మళ్లీ ఇండిగోకు నోటీసు పంపించింది. ప్లాన్ చేసినా షెడ్యూల్‌ని అమలు చేయలేకపోయిందన్న కారణంతో ఈ నోటీసు ఇచ్చి, ఇక నుంచి ఇండిగో ఫ్లైట్ ఆపరేషన్స్‌ను మరో 5% తగ్గించాలని ఆదేశించింది. ఇదే కాక, గత వారం భారీగా జరిగిన ఫ్లైట్ రద్దులపై కూడా షోకాజ్ నోటీసు ఇచ్చి, సోమవారం సాయంత్రం 6 గంటలలోపు సమాధానం ఇవ్వాలని చెప్పింది. కానీ, ఇండిగో మరికొంచెం టైమ్ కావాలని కోరుతూ, తమ ఆపరేషన్స్ చాలా పెద్దవి, క్లిష్టమైనవి కావడం వల్ల అసలు సమస్య ఏంటో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదని చెప్పిందని సమాచారం.
క్రూ రోస్టరింగ్ సమస్యలే కారణం
రాజ్యసభలో మాట్లాడిన పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరాపు, ఇండిగోకి వచ్చిన ఈ సమస్యలకు Aircraft Maintenance and Scheduling System (AMSS)కి ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. అసలు సమస్య airline లోపలే.. క్రూ షిఫ్ట్‌లు ఎలా వేయాలి, ఏ ఫ్లైట్‌కి ఎవర్ని ఎలా ప్లాన్ చేయాలన్న క్రూ రోస్టరింగ్, ఆపరేషన్స్ ప్లానింగ్‌లోనే ఉందన్నారు.
అలాగే, ఫ్లైట్‌లు లేట్ అవ్వడం, రద్దు అవ్వడం వల్ల ప్రయాణికులు పడే ఇబ్బందులను తగ్గించడానికి కఠినమైన Civil Aviation Requirements (CARs) అనే నిబంధనలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని మంత్రి వెల్లడించారు.

