Influencer Kirti Patel: దేశంలో హనీ ట్రాప్ కేసులు (Honeytrapping Cases) ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. వలపు విసిరి కొందరు కిలేడీలు.. వ్యాపారవేత్తలు, బిల్డర్లు, అమాయక యువకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా గుజరాత్ (Gujarat) లోనూ ఈ తరహా ఘటనే బయటపడింది. హానీ ట్రాప్ ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ ఇన్ స్ట్రాగ్రామ్ ఇన్ ఫ్లుయనెన్సర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది క్రితం కేసు నమోదు కాగా.. తాజాగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
గుజరాత్ సూరత్ కు చెందిన కీర్తి పటేల్ అనే యువతి (Kirti Patel).. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా బాగా పాపులర్ అయ్యింది. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 13 లక్షల మంది వరకూ ఫాలోవర్లు ఉన్నారు. అయితే గతేడాది జూన్ 2న ఆమెపై హనీ ట్రాప్ కేసు నమోదైంది. ఓ బిల్డర్ ను బెదిరించి కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని అమెపై ఆరోపణలు వచ్చాయని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ (FIR)లో ఆమెతో పాటు మరో నలుగురు పేర్లు కూడా చేర్చామని సదరు అధికారి తెలిపారు. వారిని గతంలోనే అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు.
భూ కబ్జా, దోపిడీలు సైతం..
హనీ ట్రాప్ కేసు ఒక్కటే కాకుండా కీర్తి పటేల్ పై.. భూ కబ్జా, దోపిడికి సంబంధించిన ఇతర ఫిర్యాదులు కూడా వచ్చినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఆమె అరెస్టుకు సూరత్ కోర్ట్ వారెంట్ సైతం జారీ చేసిందని పేర్కొన్నారు. దీంతో అప్పటి నుంచి కీర్తి పటేల్ కనిపించకుండా తిరుగుతోందని అన్నారు. పలు నగరాలకు మకాం.. మారుస్తూ తన లొకేషన్ తెలియకుండా ఉండేందుకు పలు సిమ్ కార్డులను ఉపయోగించినట్లు చెప్పారు.
Also Read: Air India Flights Cut: విమానాల్లో వరుస సమస్యలు.. ఎయిర్ ఇండియా షాకింగ్ నిర్ణయం.. సారీ అంటూ!
10 నెలలుగా ట్రాకింగ్!
సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కీర్తి పటేల్ ను పట్టుకునేందుకు గత పది నెలలుగా పోలీసులు శ్రమించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు అలోక్ కుమార్ (Deputy Commissioner of Police Alok Kumar) తెలిపారు. గత 10 నెలల్లో గుజరాత్ లోని వివిధ లొకేషన్స్ ఆమె మారుతూ వచ్చిందని పేర్కొన్నారు. ఆమె ఫోన్ నెంబర్లు, చిరునామాల మాదిరిగానే IP అడ్రెస్ కూడా మారుతూ వచ్చిందని చెప్పారు. తమ సాంకేతిక బృందం, సైబర్ నిపుణుల సహాయంతో ఫైనల్ గా అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్‌లో ఆమె లొకేషన్ ను ట్రాక్ చేసినట్లు చెప్పారు. అహ్మదాబాద్ లోని తమ సిబ్బందిని సంప్రదించి ఆమెను అరెస్ట్ చేసినట్లు వివరించారు.