Durga Rao ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Durga Rao: వాటిని కోసేశారంటూ.. ఏడ్చుకుంటూ వీడియో పెట్టిన టిక్ టాక్ దుర్గారావు

Durga Rao: టిక్ టాక్ దుర్గా రావు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ యాప్‌ వాడుకలో ఉన్నప్పుడు ఎంత ఫేమస్ అయ్యాడో మనందరికీ తెలుసు. నక్కిలిసు గొలుసు పాటకి మాస్ స్టెప్పులు వేస్తూ .. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అయితే, ఇదిలా ఉండగా తాజాగా టిక్ టాక్ దుర్గారావు దంపతులు ఏడ్చుకుంటూ ఓ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

వాటిని కోసేశారంటూ.. వీడియో రిలీజ్ చేసిన టిక్ టాక్ దుర్గారావు

ఇటీవలే అతని భార్యతో కలిసి ఓ ఈవెంట్ లో నక్కిలీసు గొలుసు పాటకి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ మళ్లీ వార్తల్లో నిలిచాడు. అప్పుడు కూడా ఈ సాంగ్ తోనే ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు కూడా అదే ఫామ్ ను కొనసాగిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. తనకి సంబందించిన ఫ్లెక్సీ లను చించేసి.. కోసేసి వారి గుమ్మం ముందు పడేశారంటూ ఏడ్చుకుంటూ వీడియో పెట్టాడు. ఇప్పటి వరకు ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టినా కూడా ఈ రోజు వరకు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ రోజున ఇలా చేశారంటే చాలా చాలా బాధగా ఉంది. మేము మా పని మేము చేసుకుంటున్నా కూడా చూసి తట్టుకోలేక పోతున్నారంటూ ఆయన మాటల్లో చెప్పుకొచ్చాడు.

Also Read: Ye Maaya Chesave : నాగ చైతన్యతో కలిసి సమంత మూవీ ప్రమోషన్స్? ఫ్యాన్స్ కోరిక నెరవేరుతోందా?

లక్ష్మీపురం దేవరపల్లి కి నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్నా పల్లెటూరులో టిక్ టాక్ దుర్గా రావు ఉంటున్నాడు. ఆయన ఒక రైతు బిడ్డ. ఎంతో కష్టపడి టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయ్యి 35 టీవీ షోలు చేసి, కొన్ని సినిమాల్లో ఆర్టిస్ట్ గా కూడా చేసి, రెండు తెలుగు రాష్ట్రాలో దుర్గారావు మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన సతీమణి అంటే తెలియని వారు ఎవ్వరు లేరు. అలాంటి భార్య భర్తలు లక్ష్మి పురం గ్రామంలో ఉంటున్నందుకు గర్వాపడాలి. యూట్యూబ్ లో 10 లక్షలు సబ్స్క్రయిబర్స్ వచ్చినదుంకు అయన అభిమానులు ఫ్లెక్సీ లు ప్రజెంట్ చేసి ఆయన ఇంటి ముందు పెట్టారు. అలాంటి ప్లెక్సీలు చించేశారు.

మా ఫుల్ సపోర్ట్ మీకే అంటున్న నెటిజన్స్ 

దుర్గారావు గారు, ఏడుపులే ఎదుగుదల, ఏడ్చేవాడు ఏడుస్తాడు, నవ్వే వాడు నవ్వుతాడు, ఏం పట్టించుకోనవసరం లేదు. మీ ప్రాక్టీస్ మీదే, మీరు చేసే ప్రోగ్రామ్స్ బాగుంటాయి. అలాగనే మనం అందరికీ నచ్చాలని లేదు శత్రువులు ఏదొక దిక్కులో ఉంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళను మనం పట్టించుకోకూడదు. మీరు చాలా బాధతో ఈ వీడియో చేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి అవమానాలు లెక్క చెయ్యకండి.. మీకు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీ లైఫ్ ప్రతి ఒక్కరికి ఆదర్శం. మీరు ఇలాంటి ఏవి పట్టించుకోవద్దు సార్. మీరు చాలా ఉన్నత స్థాయి కి వెళ్ళాలంటూ నెటిజన్స్ దుర్గా రావుకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు