National Herald case: మరో ట్విస్ట్... సోనియా, రాహుల్‌లపై మరో కేసు
Sonia-Rahul (Image source X)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో ట్విస్ట్… సోనియా, రాహుల్ గాంధీలపై మరో కేసు

National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో (National Herald case) మరో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ (Congress) అగ్ర నాయకులు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీలపై (Rahul Gandhi) ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం తాజాగా ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అందించిన సమాచారం ఆధారంగా అక్టోబర్ 3న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తాజా పరిణామంతో నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక ఆర్థిక లావాదేవీలు, దాని మాతృ సంస్థను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలపై తాజాగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌తో సోనియా, రాహుల్ గాంధీలకు మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి.

ఈడీ ఫిర్యాదు ఆధారంగా కేసు

మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని (PMLA) సెక్షన్ 66(2) కింద ఈడీ అధికారులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మనీల్యాండరింగ్ చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం, తమ విచారణ పరిధిలో ప్రత్యేకంగా లిస్ట్ చేసిన నేరాన్ని (షెడ్యూల్డ్ ఆఫెన్స్) నమోదు చేయాలంటూ మరో అధికార సంస్థను ఈడీ కోరవచ్చు. ఈ నిబంధన ప్రకారమే ఈడీ ఫిర్యాదు చేయగా, ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఇండియన్ పీనల్ కోడ్‌లోని (IPC) 120బీ (నేరపూరిత కుట్ర), 406 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన), 403 (చర ఆస్తి అక్రమ దుర్వినియోగం), 420 (మోసం) వంటి సెక్షన్లను చేర్చారు.

Read Also- Abhishek Sharma: 12 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 32 బంతుల్లో శతకం.. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్

రాహుల్, సోనియాతోపాటు మరికొందరు

ఈ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్, సోనియాతో పాటు మరో ఆరుగురు వ్యక్తులు, మూడు కంపెనీలను కూడా నిందితులుగా పేర్కొన్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా, మూడు కంపెనీలు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL), యంగ్ ఇండియన్, డోటెక్స్ మెర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్‌లను నిందితుల జాబితాలో చేర్చారు. కోల్‌కతా కేంద్రంగా ఉన్న డోటెక్స్ కంపెనీని గత విచారణల్లో ఒక షెల్ కంపెనీగా పేర్కొన్నారు. ఈ కంపెనీయే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాటాదారులుగా ఉన్న యంగ్ ఇండియన్ సంస్థకు కోటి రూపాయలను బదిలీ చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

Read Also- December 2025: డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కీలక మార్పులు.. ఎల్‌పీజీ, ఇంధన ధరలు, బ్యాంకింగ్ సేవలు, లోన్ రేట్లపై ప్రభావం

ఏజేఎల్ స్వాధీనానికి నేరపూరిత కుట్ర

ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పలు కీలక విషయాలు ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన ఏజేఎల్(అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్) కంపెనీని అక్రమ పద్ధతుల ద్వారా స్వాధీనం చేసుకునేందుకు నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనే అభియోగాలు నమోదు చేశారు. ఏజేఎల్ ఆస్తుల విలువ సుమారుగా రూ.2,000 కోట్ల వరకు ఉన్నప్పటికీ, యంగ్ ఇండియన్ సంస్థ కేవలం రూ.50 లక్షలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెల్లించి, ఏజేఎల్‌ యాజమాన్యంపై నియంత్రణ సాధించిందనేది ప్రధాన ఆరోపణగా ఉంది. ఇక, డోటెక్స్ నుంచి యంగ్ ఇండియన్‌ కంపెనీకి బదిలీ చేసిన కోటి రూపాయల లావాదేవీ ఈ స్వాధీన ప్రక్రియలో కీలక పాత్ర పోషించిందని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఏజేఎల్‌కు చెందిన విలువైన ఆస్తులను యంగ్ ఇండియన్ చేతుల్లోకి వెళ్లడానికే అక్రమ పద్ధతుల ద్వారా ఈ లావాదేవీలు జరిపారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. మరి ఈ కేసు విచారణలో అంతిమంగా ఏం తేలుతుందో వేచిచూడాలి.

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!