Abhishek Sharma: 32 బాల్స్‌లో శతకం.. అభిషేక్ సంచలన బ్యాటింగ్
Abhishek-Sharma (Image source Twitter)
స్పోర్ట్స్

Abhishek Sharma: 12 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 32 బంతుల్లో శతకం.. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్

Abhishek Sharma: ‘పవర్ ప్లే హంటర్’గా పేరున్న టీమిండియా యువ క్రికెటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్ విధ్వంసం ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాలా!.. భయం బెరుకు లేకుండా తొలి బంతి నుంచే బౌండరీలే లక్ష్యంగా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతుంటాడు. క్రీజులోకి వచ్చాడంటే చాలు, బౌలర్ ఎవరైనా, పిచ్ ఎలా ఉన్నా తొలి బంతి నుంచే దూకుడు ప్రదర్శిస్తూ ఆడుతుంటాడు. ఇంకా చెప్పాలంటే, టీ20 క్రికెట్‌లోనే కొత్త ట్రెండ్‌కు నాంది పలికాడు. పవర్ ప్లే ఓవర్లలో భారీ షాట్లతో తను ఆడే జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందిస్తూ, ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో గుబులు రేపుతున్నాడు. అలాంటి మరో అద్భుతమైన, బ్యాటింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.

Read Also- Lenskart B: లెన్‌స్కార్ట్ నుంచి సరికొత్త కళ్లజోళ్లు.. యూపీఐ పేమెంట్స్, ఫొటోలు, వీడియోల చిత్రీకరణతో పాటు ఎన్నో ఫీచర్లు

టీమిండియా ఓపెనర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ ఆదివారం నాడు పరుగుల సునామీ సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) ఎలైట్ గ్రూప్-సీలో భాగంగా ఆదివారం హైదరాబాద్ వేదికగా బెంగాల్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌లో (Punjab vs Bengal) చెలరేగి ఆడాడు. పంజాబ్ తరపున బరిలోకి దిగిన అభిషేక్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. కేవలం 12 బంతుల్లోనే తన అర్ధసెంచరీని పూర్తి చేశాడు. అంతేకాదు, ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లోనే శతకాన్ని కూడా పూర్తి చేశాడు. మొత్తం 52 బంతులు ఎదుర్కొని 148 పరుగులు సాధించాడు. ప్రత్యర్థి బెంగాల్ జట్టులో మహ్మద్ షమీ, ఆకాష్ దీప్ వంటి స్టార్ బౌలర్లు ఉన్నప్పటికీ అభిషేక్ శర్మ విధ్వంసాన్ని అడ్డుకోలేకపోయారు. ఈ మ్యాచ్‌లో సెంచరీలోపు మొత్తం 7 ఫోర్లు, 11 సిక్సర్లు బాదాడు. మ్యాచ్ మొత్తంలో ఏకంగా 17 సిక్సర్లు కొట్టి బీభత్సం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతడి స్ట్రైక్ రేట్ 300కు పైగా నమోదయింది.

బద్ధలైన పలు రికార్డులు

అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడడంతో పలు రికార్డులు బద్ధలయ్యాయి. 12 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించడం ద్వారా టీ20 చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ పూర్తి చేసిన భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఆశుతోష్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. రైల్వేస్ తరఫున అరుణాచల్ ప్రదేశ్‌పై కేవలం 11 బంతుల్లోనే అశుతోష్ 50 పరుగులు సాధించాడు. ఇక, 32 బంతుల్లో సెంచరీ విషయానికి వస్తే, టీ20 హిస్టరీలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన మూడవ భారతీయ బ్యాటర్‌గా రికార్డు సాధించాడు.

Read Also- Heavy Rains: దిత్వా తుఫాన్.. భారీ వర్షాలు, ఈదురుగాలులతో ఏపీలో రెడ్ అలర్ట్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం ఈ మ్యాచ్‌లో నమోదయింది. అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్‌ జోడి ఏకంగా 205 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. టోర్నీ చరిత్రలో అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యం ఇదే. ఇక, అభిషేక్ శర్మ సాధించిన 148 పరుగులు ఈ టోర్నమెంట్‌లో రెండవ అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదయింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ మొత్తం 17 సిక్సర్లు కొట్టాడు. దీంతో, టోర్నమెంట్ హిస్టరీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండవ బ్యాటర్‌గా నిలిచాడు. అభిషేక్ శర్మ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా పంజాబ్ జట్టు సునాయాసంగా 300 పరుగుల మార్కును చేరింది. నిర్ణీత 20 ఓవర్లలో జట్టు స్కోరు 310గా నమోదయింది. దీంతో, టోర్నీ చరిత్రలో ఒక జట్టు 300 పరుగుల మార్కును దాటడం ఇది రెండోసారి మాత్రమే. 2023లో సిక్కింపై బరోడా చేసిన 349 పరుగుల స్కోర్ తొలి రికార్డుగా నమోదయింది.

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!