December 2025: డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కీలక మార్పులు
December 2025 ( Image Source: Twitter)
బిజినెస్

December 2025: డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కీలక మార్పులు.. ఎల్‌పీజీ, ఇంధన ధరలు, బ్యాంకింగ్ సేవలు, లోన్ రేట్లపై ప్రభావం

December 2025: డిసెంబర్ 2025, వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వచ్చే కొన్ని కీలక మార్పులు నేరుగా మీ ఖర్చులపై ప్రభావం చూపనున్నాయి. డిసెంబర్ 1 నుంచి ఏ అంశాలు మీ ఖర్చులను పెంచగలవో, భవిష్యత్తుకు సేవింగ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో ఏ విషయాలు గమనించాల్సి ఉంటుందో ఇక్కడ చూద్దాం..

డిసెంబర్ 2025 నుంచి అమల్లోకి వచ్చే ముఖ్య మార్పులు:

బ్యాంకుల సెలవుల తేదీలు, బ్యాంక్ లోన్ రేట్లలో మార్పులు, ఇంధన ధ‌ర‌ల నెలవారీ సవరణ, పెన్షన్‌కు సంబంధించిన నియమాలు వంటి పలు అంశాలు నేరుగా వినియోగదారుల జేబుపై ప్రభావం చూపనున్నాయి.

ఎల్పీజీ, ఏటీఎఫ్ ఇంధన ధరలు డిసెంబర్ 1న సవరణ

ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) వంటగ్యాస్ సిలిండర్లలో ఉపయోగించే ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ధరలను, అలాగే విమానాల్లో ఉపయోగించే ఏర్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలను సవరిస్తాయి. ఇవి అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరల సగటు, విదేశీ మారకద్రవ్య మార్పిడి రేట్ల ఆధారంగా నిర్ణయించబడతాయి.

డిసెంబర్ 1న ధరలు పెరిగినా లేదా తగ్గినా, గృహ అవసరాల కోసం ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్, కమర్షియల్ ఉపయోగానికి ఉన్న 19 కిలోల సిలిండర్ ధరలపై ప్రభావం పడుతుంది. అదేవిధంగా, ATF ధరలు మారితే విమాన టికెట్ ధరల్లో కూడా మార్పులు రావచ్చు.

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!