Delhi Fuel Ban: PUC లేని వాహనాలకు ఇంధనం నిలిపివేత
Delhi Fuel Ban ( Image Source: Twitter)
జాతీయం

Delhi Fuel Ban: PUC లేకుంటే పెట్రోల్ లేదు.. ఢిల్లీ ప్రభుత్వ ఉత్తర్వులతో డీలర్లకు కొత్త సవాళ్లు

Delhi Fuel Ban: ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం అమలులోకి వచ్చింది. వెలిడ్ కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ (PUCC) లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ ఇవ్వకూడదు అనే “ No PUCC, No Fuel ” నిబంధనను గురువారం నుంచి అమలు చేయనుంది. ఇదే సమయంలో BS-VI ప్రమాణాలకు తక్కువగా ఉన్న ప్రైవేట్ నాన్-ఢిల్లీ వాహనాల నగర ప్రవేశాన్ని కూడా నిషేధించింది.

అయితే, ఈ నిర్ణయం అమలులో అనేక ఆచరణాత్మక సమస్యలు ఉన్నాయని ఢిల్లీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ (DPDA) పేర్కొంది. పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాకు ఇచ్చిన వినతి పత్రంలో, కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది.

Also Read: Telangana Congress: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహం.. అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీలు!

అమలు కష్టం అని హెచ్చరిక

DPDA ప్రకారం, “ అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ చర్యలు అవసరమే అయినా, కీలక సమస్యలు పరిష్కరించకుండా ఈ ఆదేశాలను అమలు చేయడం చాలా కష్టమైన, క్లిష్టమైన పని” అని పేర్కొంది. ఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న కాలుష్యంలో ఎక్కువ భాగం నగర సరిహద్దుల వెలుపలి నుంచి వచ్చే ట్రాన్స్‌బౌండరీ పొల్యూషన్ వల్లేనని సంఘం అభిప్రాయపడింది. కేవలం ఢిల్లీ NCT పరిధిలో మాత్రమే చర్యలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు రావని, మొత్తం NCR ప్రాంతం అంతటా ఒకే విధమైన అమలు అవసరం అని సూచించింది.

Also Read: Panchayat Elections: ప్రశాంతంగా ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు.. మూడు విడత ఎన్నికల్లో 85.77 శాతం పోలింగ్​ నమోదు!

చట్టపరమైన అడ్డంకులు

పెట్రోల్ పంపుల్లో ఇంధనం విక్రయించకపోవడం 1955 Essential Commodities Act, 1998 Motor Spirit & High Speed Diesel Order పరిధిలోకి వస్తుందని DPDA పేర్కొంది. కాబట్టి, పెట్రోల్ బంకులు ఈ ఆదేశాన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే, ఇంధన విక్రయ నిరాకరణను డీక్రిమినలైజ్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

అమలు బాధ్యత ఎవరిది?

“పెట్రోల్ బంకులు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు కావు” అని DPDA స్పష్టం చేసింది. “No PUCC, No Fuel” నిబంధనను అమలు చేయాల్సింది చట్టబద్ధ అధికారాలు కలిగిన ప్రభుత్వ విభాగాలేనని తెలిపింది. పెట్రోల్ బంక్ సిబ్బందిని ప్రజలు అమలు అధికారులుగా చూడరని, ఇంధనం నిరాకరిస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.

డీలర్లపై శిక్షలు వద్దు

ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో సహకరిస్తున్న పెట్రోల్ డీలర్లపై శిక్షాత్మక చర్యలు తీసుకోకూడదని DPDA విజ్ఞప్తి చేసింది. డీలర్లు కేవలం ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారే తప్ప, అమలు బాధ్యత వారి మీద వేయడం అన్యాయమని పేర్కొంది.

Also Read: Chamala Kiran Kumar Reddy: బొమ్మాయి పల్లి రైల్వే స్టేషన్‌లో ప్రధాన రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కేంద్ర మంత్రికి ఎంపీ చామల వినతి

టెక్నికల్ సమస్యలపై అభ్యంతరం

ఈ నిర్ణయం అమలులో పలు సాంకేతిక లోపాలు ఉన్నాయని DPDA తెలిపింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఎమిషన్ చెకింగ్ వ్యవస్థ పాతదైపోయిందని, దాన్ని తక్షణమే అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. అదే విధంగా, పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేసిన ANPR కెమెరాలకు సంబంధించి లైవ్ డాష్‌బోర్డ్ , రియల్‌టైమ్ ఫీడ్ అందుబాటులో లేకపోవడం మరో ప్రధాన సమస్యగా పేర్కొంది. ఇంతకుముందు ఈ విధానాన్ని అమలు చేసేందుకు సరైన ట్రయల్ రన్ జరగలేదని, గతంలో నిర్వహించిన పరీక్షల్లో అధికంగా జంక్ డేటా రావడంతో మొత్తం డ్రైవ్ విఫలమైందని DPDA స్పష్టం చేసింది. ఈ లోపాలను సరిదిద్దకుండా ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేయడం కష్టమని అభిప్రాయపడింది.

Just In

01

Mobile Recharge: మొబైల్ యూజర్లకు షాక్.. మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు

YS Jagan Mass Warning: అధికారంలోకి రాగానే.. వాళ్లని జైల్లో పెడతాం.. జగన్ మాస్ వార్నింగ్

Google Pixel 10: Pixel 10 యూజర్లకు గుడ్ న్యూస్.. GPU అప్డేట్ వచ్చేసింది!

Avatar Fire and Ash: జేమ్స్ కామెరూన్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమాపై పాన్ ఇండియా దర్శకుడు ప్రశంసలు..

Google Meet Update: మీటింగ్‌లో వాయిస్ కట్ సమస్యకు చెక్.. గూగుల్ మీట్ కొత్త అప్‌డేట్