Panchayat Elections: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మూడు విడతల్లో నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జరిగిన మూడు విడత ఎన్నికల్లో 85.77 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మూడో విడత ఎన్నికలను నిర్వహించారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్నికల అధికారులు కౌంటింగ్ ప్రారంభించి, విజేతలను ప్రకటించారు. ఉపసర్పంచుల ఎన్నిక కూడా పూర్తి చేశారు.
యాదాద్రి భువనగిరి 92.56%,
మూడో విడత లో 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం ఇచ్చింది. ఇందులో 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 11 గ్రామ పంచాయతీలు, 116 వార్డుల్లో నామినేషన్ లు దాఖలు కాలేదు. 3,752 గ్రామ పంచాయతీలు, 28,410 వార్డులకు నిర్వహించగా సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డులకు 75,725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండు పంచాయతీలు, 18 వార్డుల ఎన్నికలు జరగలేదు. ఈ విడుతలో మొత్తం 50,56,344 మంది ఓటర్లు ఉండగా.. 43,37,024 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. యాదాద్రి భువనగిరి 92.56%, మెదక్ 90.68%, సూర్యాపేట 89.25%, నల్గొండ 88.72% నమోదైంది.
ఎలక్షన్ ఆఫీసర్లకు ఎప్పటికప్పుడు సూచనలు
నిజామాబాద్ జిల్లాల్లో పోలింగ్ శాతం తక్కువ నమోదయింది. జిల్లాలో 76.45% నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మూడోవిడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్163 (పాత 144 సెక్షన్) కింద నిషేధాజ్ఞలు అమలు చేశారు. గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉపసర్పంచ్‌లను ఎన్నుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని, పంచాయతీ ఎన్నికల అథారిటి సృజన, ఎస్ఈసీ సెక్రటరీ మంద మకరందు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ సరళిని అబ్జర్వ్ చేసి జిల్లా ఎలక్షన్ ఆఫీసర్లకు ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. ఈ సారి 3,547 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించారు.

