TG Panchayat Elections 2025: ప్రశాంతంగా పంచాయతీ పోలింగ్
TG Panchayat Elections 2025 (Image Source: Twitter)
Telangana News

TG Panchayat Elections 2025: ప్రశాంతంగా పంచాయతీ పోలింగ్.. ఉత్సాహాంగా ఓట్లు వేస్తోన్న పల్లెవాసులు

TG Panchayat Elections 2025: తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకు మెుదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ కొనసాగనుంది. అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మెుదలవుతుంది. గెలిచిన అభ్యర్థుల వివరాలను ప్రకటించనున్నారు. సర్పంచ్, వార్డు ఫలితాలు వెలువడిన వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక కూడా జరగనుంది.

9 గంటల వరకు పోలింగ్ ఎంతంటే?

ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య పలు జిల్లాల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని అధికారులు వెల్లడించారు. నిర్మల్ జిల్లాలో 18.60 శాతం, సిద్ధిపేటలో 24.35 శాతం, మెదక్ 24.89 శాతం, సంగారెడ్డి 26.75శాతం, ఉమ్మడి నల్లగొండ 29 %, మంచిర్యాల 27.15%, రంగారెడ్డి 21.58 శాతం, పెద్దపల్లి 22.50 శాతం, జయశంకర్ భూపాలపల్లి 26.11 శాతం, వరంగల్ 22.26 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

ఉత్సాహాసంగా ఓటింగ్..

మూడో విడత పంచాయతీ పోలింగ్ చాలా చోట్ల శాంతియుత వాతావరణంలో కొనసాగుతోంది. యువతీ యువకులు, పెద్దలు, వృద్ధులు, వికలాంగులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకమున్న సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేస్తున్నారు. మరోవైపు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

3,752 గ్రామాల్లో పోలింగ్..

మూడో విడతలో భాగంగా 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 11 గ్రామ పంచాయతీలు, 116 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ప్రస్తుతం 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడో విడతలో మెుత్తం 36,483 పోలింగ్​ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేయగా.. ఓటర్లు ఆయా కేంద్రాల వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

Also Read: CS Ramakrishna Rao: మెట్రో టేకోవర్‌కు డెడ్‌లైన్ ఫిక్స్.. మార్చి కల్లా ప్రక్రియను పూర్తి చేయాలి.. రామకృష్ణారావు ఆదేశం!

పటిష్ట బందోబస్తు ఏర్పాటు

మరోవైపు మూడో విడత పోలింగ్ కోసం పటిష్ట బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. 3,547 కేంద్రాల్లో వెబ్​కాస్టింగ్​ నిర్వహిస్తున్నారు. 4,502 మంది ఆర్వోలు, 77,618 మంది పోలింగ్​ సిబ్బంది, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు విధుల్లో ఉన్నారు. ఈ విడతలో మొత్తం 53,06,401 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పురుషులు 26,01,861 మంది ఉండగా, మహిళలు 27,04,394 మంది, ఇతరులు 140 మంది ఉన్నారు. దాదాపు లక్ష మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

36,165 మందిని బైండోవర్

పంచాయతీ పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 36,165 మందిని బైండోవర్ చేయగా.. 912 లైసెన్స్డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల సంఘం టీఈ–పోల్​ (Te-poll) అనే మొబైల్ యాప్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఓటర్లు తమ స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు, పోలింగ్ కేంద్రం ఎక్కడుందో మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫిర్యాదుల కోసం 9240021456 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని ఎన్నికల అధికారులు తెలిపారు.

Also Read: Virat Anushka: విరాట్ కోహ్లీ, అనుష్కలపై మండిపడుతున్న నెటిజన్లు.. ప్రేమానంద్ జీ చెప్పింది ఇదేనా?

Just In

01

Bigg Boss9 Telugu: చివరి రోజుల్లో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 9’.. ఈ ఫన్ మామూలుగా లేదుగా..

Dr Gopi: రైతుల కష్టాలకు చెల్లు.. ఇది ఒక్కటీ ఉంటే చాలు, ఇంటికే యూరియా!

IND vs SA 4th T20I: లక్నోలో నాల్గో టీ-20.. సిరీస్‌పై కన్నేసిన భారత్.. దక్షిణాఫ్రికాకు అసలైన పరీక్ష!

Hyderabad Police: నమ్మించి పని మనుషులుగా ఉద్యోగాల్లో చేరి.. బంగారు ఆభరణాలు చోరీ!

Ustaad BhagatSingh : ‘దేఖలేంగే సాలా..’ సాంగ్ చూసి వీవీ వినాయక్ హరీష్‌కు చెప్పింది ఇదే.. ఇది వేరే లెవెల్..