CS Ramakrishna Rao: మెట్రో టేకోవర్‌కు డెడ్‌లైన్ ఫిక్స్
CS Ramakrishna Rao ( IMAGE CREDIT; SWETCHA REPORTER)
హైదరాబాద్

CS Ramakrishna Rao: మెట్రో టేకోవర్‌కు డెడ్‌లైన్ ఫిక్స్.. మార్చి కల్లా ప్రక్రియను పూర్తి చేయాలి.. రామకృష్ణారావు ఆదేశం!

CS Ramakrishna Rao: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు సూచించారు. ఆయన కార్యదర్శుల స్థాయి కమిటీ, ఎల్ అండ్ టీ అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడారు. ఇరుపక్షాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బదలాయింపు సజావుగా వేగవంతంగా పూర్తి కావాలని సూచించారు. ఈ ప్రక్రియను ఇదివరకు చేసుకున్న ఒప్పందాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చేపట్టాలన్నారు. రాబోయే వంద రోజుల్లో ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు.

Also Read: CS Ramakrishna Rao: శంషాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను సందర్శించిన సీఎస్

ప్రతిపాదనలను రూపొందించాలి 

టేకోవర్ ప్రక్రియపై ఏర్పాటు చేసిన ట్రాన్సాక్షన్ అడ్వైజర్ ఐడీబీఐ ఈ మేరకు తన నివేదికను త్వరితగతిన పూర్తి చేసి బదలాయింపు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇందులో ఎల్ అండ్ టీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఆ తర్వాత ఆపరేషనల్, మెయింటెనెన్స్‌కు సంబంధించి ప్రతిపాదనలను రూపొందించాల్సిందిగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ సర్పరాజ్ అహ్మద్‌ను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు డా. ఎన్వీఎస్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ కేవీబీ రెడ్డి, ఐడీబీఐ అధికారులు, హెచ్ఎంఆర్ఎల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్ రాజు పాల్గొన్నారు.

Also Read: CS Ramakrishna Rao: శంషాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను సందర్శించిన సీఎస్

Just In

01

Ustaad BhagatSingh : ‘దేఖలేంగే సాలా..’ సాంగ్ చూసి వీవీ వినాయక్ హరీష్‌కు చెప్పింది ఇదే.. ఇది వేరే లెవెల్..

Jupally Krishna Rao: బంగ్లాదేశ్ అవతరణకు కారణం అదే.. ఇందిరా గాంధీ నాయకత్వాన్ని గుర్తుచేసిన జూపల్లి!

GHMC Council: వాడివేడిగా కౌన్సిల్ సమావేశం.. పార్టీలకతీతంగా పునర్విభజనపై సభ్యుల ప్రశ్నల వర్షం!

TG Panchayat Elections 2025: ప్రశాంతంగా పంచాయతీ పోలింగ్.. ఉత్సాహాంగా ఓట్లు వేస్తోన్న పల్లెవాసులు

The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో తెలుసా!.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?