Delhi Blast Case: ఉగ్రవాది ఉమర్ ‘అన్‌సీన్ వీడియో’ వెలుగులోకి
Umar (Image source Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Delhi Blast Case: ఢిల్లీ పేలుడుకు పాల్పడ్డ బాంబర్ ‘అన్‌సీన్ వీడియో’ వెలుగులోకి.. వామ్మో వీడు మామూలోడు కాదు

Delhi Blast Case: ఢిల్లీ పేలుడుతో యావత్ (Delhi Blast Case) దేశాన్ని షాక్‌కు గురిచేసిన బాంబర్, డాక్టర్ రూపంలో ఉన్న ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీ (Umar Un Nabi) ఎలాంటి వాడో, అతడి ఉగ్రవాద నిజస్వరూపం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎన్ఐఏతో పాటు (NIA) ఇతర ఏజెన్సీలు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో, తాజాగా అతడికి సంబంధించిన ‘అన్‌సీన్ వీడియో’ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. అతడి తీవ్రవాద మనస్తత్వం ఈ వీడియో ద్వారా మరింత స్పష్టమైంది. వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో ఉగ్రవాది ఉమర్ ‘ఆత్మహుతి’పై తన అభిప్రాయాలను చెప్పాడు.

ఆత్మహుతి దాడుల భావనను చాలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారని అన్నాడు. నిజానికి ఆత్మహుతి దాడి ఒక ‘అమరత్వ ఆపరేషన్’ అని అభిప్రాయపడ్డాడు. ఆత్మహుతి దాడిగా ముద్రవేశారని, నిజానికి ఇస్లాంలో ఇదొక ‘అమరత్వ ఆపరేషన్’ అని వివరించాడు. ఆత్మహుతిపై భిన్నవాదనలు, విరుద్ధ విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయని ప్రస్తావించాడు. ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట ప్రదేశంలో, నిర్దిష్ట సమయంలో తాను చనిపోతానని ముందుగానే తెలిసి చనిపోవడమే ‘అమరత్వ ఆపరేషన్’ అని పేర్కొన్నాడు. ప్రత్యేక పరిస్థితిలో చనివపోడం అని అభివర్ణించాడు. తన విషయంలో ఆ పరిస్థితి లేదని ఉమర్ వీడియోలో పేర్కొన్నాడు. మొత్తంగా ఉమర్ పూర్తి ఉగ్రవాదిగా మారినట్టుగా ఆ వీడియో ద్వారా స్పష్టమైంది. కాగా, ఈ వీడియో ఇంగ్లిష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడాడు.

Read Also- Collector Adwait Kumar Singh: ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు చేస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మరికొందర్ని ఉగ్రవాదులుగా మార్చేందుకుగానూ, బ్రెయిన్ వాష్ చేయడానికి ఈ వీడియోను రికార్డ్ చేసి ఉంటాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఉమర్ చేసిన వ్యాఖ్యలు, ఆత్మాహుతి దాడికి సిద్ధపడే వ్యక్తి తీవ్రవాద మనస్తత్వాన్ని స్పష్టం చేస్తున్నాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. అయితే, గతవారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఆత్మహుతి కాకపోయి ఉండొచ్చని, భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేస్తుండగా, కారులో ఉన్న బాంబులు ప్రమాదవశాత్తూ పేలు ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

కొన్ని నెలల్లోనే మార్పు

ఉగ్రవాది ఉమర్ జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఉన్న కోయిల్ గ్రామానికి చెందినవాడు. చాలా సైలెంట్‌గా ఉండేవాడని, గంటల తరబడి చదువుతూ ఉండేవాడిగా బంధువులు, చుట్టాలు చెబుతున్నారు. అయితే, ఉమర్ ప్రవర్తన ఇటీవల కాలంలో బాగా మారిపోయిందని పోలీసులు అంటున్నారు. అక్టోబర్ 30 నుంచి అల్ ఫలా యూనివర్సిటీలో డ్యూటీ మానేశాడని, ఫరీదాబాద్ -ఢిల్లీ మధ్య తరచు తిరగడం మొదలుపెట్టాడని పేర్కొన్నారు. రామ్‌లీలా మైదాన్, సునేహ్రీ మసీదు సమీపంలోని మసీదులను సందర్శించేవాడని తెలిపారు.

ఫరీదాబాద్‌లో పోలీసులు దాడులు నిర్వహించి ఒక గిడ్డంగిలో భద్రపరిచిన దాదాపు 2,900 కేజీల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకోవడం, ఉమర్ సహచరుల్లో కొందర్ని అరెస్టు చేయడంతో ఉమర్ అండర్ ‌గ్రౌండ్‌లోకి వెళ్లాడు. నవంబర్ 9 నుంచి అదృశ్యమయ్యాడు. ఐదు ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసినట్టు పోలీసులు ఒక అంచనా వచ్చారు. ఇక, ఢిల్లీ పేలుడు తర్వాత ఉగ్రవాద నెట్‌వర్క్‌ను గుర్తించడంతో డా.ముజమ్మిల్ టర్కీకి వెళ్లినట్టు కూడా దర్యాప్తు అధికారులు పసిగట్టారు.

Read Also- Nayanthara in NBK111: బాలయ్య బాబు సరసన నాలుగోసారి హీరోయిన్‌గా నటించనున్న ఇండియన్ క్వీన్.. ఎవరంటే?

Just In

01

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?

Grok AI Misuse: 3 రోజుల్లో ఆ కంటెంట్‌ను తొలగించండి.. ‘ఎక్స్’కి కేంద్రం సంచలన నోటీసులు

Urea Supply: రైతులు క్షమించరు జాగ్రత్త.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై ఫైర్

RTC Bus Accident: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం… తెల్లారిన దంపతుల బతకులు

GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు