Nayanthara in NBK111: బాలయ్య NBK111 హీరోయిన్ ఎవరంటే?..
nbk111(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Nayanthara in NBK111: బాలయ్య బాబు సరసన నాలుగోసారి హీరోయిన్‌గా నటించనున్న ఇండియన్ క్వీన్.. ఎవరంటే?

Nayanthara in NBK111: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘NBK111’. తాజాగా ఈ సినిమా లో కథానాయికగా నయనతార నటించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. నయనతార పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ అనౌన్స్‌మెంట్ వీడియో అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. నయనతార నటసింహం సరసన ఇది నాలుగో సారి నటించడం. ఈ సినిమాలో మహారాణిగా నయన తార కనిపించనున్నారు. రాయల్ లుక్ చూసిన నయనతార అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆమె మహారాణి ప్రాత్రలో ఇదిగిపోతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే వేచి ఉండాల్సిందే.

Read also-Human Sagar death: ప్రముఖ ఒడియా గాయకుడు కన్నుమూత.. రాజకీయ ప్రముఖులు సంతాపం

వీడియోలో హైలైట్స్

నయన తార పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ఆమె ‘మహారాణి’ పాత్రలో చూపించారు. గుర్రంపై స్వారీ చేస్తున్న రాయల్ లుక్‌లో కనిపించి ఆమె అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది. ఇది ఆమె పోషించబోయే పవర్ ఫుల్ పాత్రకు అద్దం పడుతోంది. ఇది ఒక చారిత్రక యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ రాజు పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇంతకు ముందు అనేక సినిమాల్లో రాజు పాత్రలో కనిపించిన నందమూరి బాలకృష్ణ దాదాపు అన్నీ విజయ బావులా ఎగురవేశాయి. ఈ సినిమాకూడా ఆదే స్థాయిలో హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Read also-Manchu Lakshmi: ప్రతిదీ భర్తని అడిగి చెయ్యాలా .. అలా ఏ రాజ్యాగంలో రాసి ఉంది? మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్

బ్లాక్‌బస్టర్ కాంబో రిపీట్

బాలకృష్ణ, నయనతార కలిసి నటిస్తున్న నాలుగో చిత్రం ఇది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘సింహా’, ‘శ్రీ రామరాజ్యం’, ‘జై సింహా’ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. దాంతో, ఈ నాలుగో కలయికపై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. వీర సింహా రెడ్డి తర్వాత బాలకృష్ణతో ఈయనకు ఇది రెండో సినిమా. వృద్ది సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నయనతార ఎంట్రీతో NBK111 ప్రాజెక్ట్ స్కేల్ మరింత పెరిగిందని, ఇది తెలుగు సినిమా స్థాయిని పెంచే ఒక పాన్ ఇండియా చిత్రంగా నిలవడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Just In

01

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?

Grok AI Misuse: 3 రోజుల్లో ఆ కంటెంట్‌ను తొలగించండి.. ‘ఎక్స్’కి కేంద్రం సంచలన నోటీసులు

Urea Supply: రైతులు క్షమించరు జాగ్రత్త.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై ఫైర్

RTC Bus Accident: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం… తెల్లారిన దంపతుల బతకులు

GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు