Human Sagar death: ఒడియా సంగీత పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ ఒడియా గాయకుడు హ్యూమన్ సాగర్ (Human Sagar) కేవలం 34 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ వార్త ఒడియా సంగీత పరిశ్రమను సోక సంద్రంలో మునిగిపోయింది. తన గానంతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న ఈ యువ గాయకుడి ఆకస్మిక మరణం అభిమానులను, సంగీత ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read also-Varanasi: తప్పిదం మానవుడిది.. నింద దేవుడిపై.. ఏంటిది రాజమౌళి?
తీవ్ర అనారోగ్యం
నవంబర్ 17న, AIIMS భువనేశ్వర్ అత్యవసర విభాగానికి హ్యూమన్ సాగర్ తీవ్ర అనారోగ్యంతో చేరారు. ఆసుపత్రి అధికారులు విడుదల చేసిన బులిటెన్ ప్రకారం, ద్వైపాక్షిక న్యుమోనియా, కాలేయ వైఫల్యం కార్డియోమయోపతి వంటి పలు సంక్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడ్డారు. దీంతో ఆయన తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యారు. AIIMS వైద్యులు నిరంతరంగా ఆయనకు చికిత్స అందించినప్పటికీ, ఆయన ఆరోగ్యం విషమించడంతో మల్టీ-ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ సిండ్రోమ్ (MODS) కారణంగా సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఇది ఒడియా సంగీతానికి సినిమా రంగానికి తీరని లోటును మిగుల్చింది.
రాజకీయ ప్రముఖుల సంతాపం
హ్యూమన్ సాగర్ మరణంపై ఒడిశా రాజకీయ ప్రముఖులు తమ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తన సంతాప సందేశంలో, “హ్యూమన్ సాగర్ మరణం మన సంగీతానికి, సినిమాకు తీరని లోటు. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అని రాసుకొచ్చారు. ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఆయన మరణంపై తమ బాధను ప్రజలతో పంచుకున్నారు. “హ్యూమన్ సాగర్ హృదయానికి హత్తుకునే సంగీతం అసంఖ్యాక హృదయాలను తాకింది. ఒడియా సంగీతానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి,” అని ఆయన ట్వీట్ చేశారు. రెండు రోజుల క్రితం, పట్నాయక్ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ ట్వీట్ చేయడం గమనార్హం.
Read also-SS Rajamouli: రాజమౌళి పై కేసు నమోదు.. దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమన్న వానరసేన?
సంగీత ప్రస్థానం
బొలంగీర్ జిల్లాలోని టిట్లాగఢ్‌లో జన్మించిన హ్యూమన్ సాగర్ తన అద్భుతమైన గాన శైలితో ఒడియా సంగీత పరిశ్రమలో శిఖరాగ్రానికి చేరుకున్నారు. ఆయన ‘ఇష్క్ తు హి తు’ టైటిల్ ట్రాక్‌తో ముఖ్యంగా ప్రసిద్ధి చెందారు. తన కెరీర్‌లో వందలాది ఒడియా సినిమా పాటలతో పాటు, ‘నిస్వాస’, ‘బేఖుదీ’, ‘తుమ ఓథ తలే’, ‘చెహెరా’ (2017) వంటి అనేక ప్రముఖ ఆల్బమ్‌లను అందించారు. ఆయన గానం, భావోద్వేగ లోతు ఒడిశా యువతలో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని కల్పించాయి. ఒడియా పాటలతో పాటు, ఆయన ఒక హిందీ ఆల్బమ్ ‘మేరా యే జహాన్’ ను కూడా విడుదల చేశారు. ఆయన మరణంతో, ఒక తరాన్ని నిర్వచించిన స్వరం శాశ్వతంగా మూగబోయింది. ఆయన మరణంతో ఇడియా సంగీత ప్రపంచం మూగబోయింది.
