SS Rajamouli: రామోజీ ఫిల్మ్ సిటీలో SSMB 29 సినిమా టైటిల్ రివీల్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతుం ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్ ను ఖరారు చేశారు. మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తుంది. పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే, ఈ ఈవెంట్ లో రాజమౌళి చేసిన దేవుడి పై చేసిన కామెంట్స్ పెద్ద వివాదానికి దారి చేశాయి.
వారణాసి టైటిల్ ఈవెంట్ లో రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని కొందరు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సరూర్ నగర్ పోలీసులకు రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదు చేశారు.రాజమౌళిపై కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఎవరూ కూడా హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు పోలీసులను కోరారు.
నువ్వు సినిమా తీస్తే తీసుకో.. అది నీ ఇష్టం, దేవుళ్ళ పై ఇలా కామెంట్స్ చేస్తారా? అయిన దేవుళ్ళ పై నమ్మకం లేకుండానే దేవుడి పేర్లు పెట్టి సినిమాలు తీస్తున్నావా? సక్సెస్ తలకెక్కితే ఇలాగే ఉంటుంది. ఏం చేద్దాం? ఇప్పుడు నువ్వు దేవుళ్ళతోనే పెట్టుకున్నావ్ ? చూద్దాం నీ సినిమా ఎలాంటి అడ్డంకులు ముందుకు వెళ్తుందా అనేది? మనుషులు తప్పు చేస్తే దేవుళ్ళను ఎందుకు నిందించడం అని రాజమౌళి చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంకొందరు అసలు నిన్ను ఎవరు సినిమాలు తియ్యమన్నారు? నువ్వు సినిమాలు తీసి మమ్మల్ని ఎంటర్టైన్ చెయ్ బాబు అని మేము చెప్పలేదుగా.. మళ్ళీ తీసి ఇలాంటి మాటలు అనడం దేనికి? అంటూ ఒక రేంజ్ లో రాజమౌళి ని ఏకిపారేస్తున్నారు.
