Chhattisgarh: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వరుస ఎన్కౌంటర్లలో అగ్ర నాయకులు మృతి చెందడం, అగ్ర నాయకుల్లో విభేదాలు కలగడం, పార్టీ భవిష్యత్తుపై కార్యాచరణ లేకపోవడం, ప్రజల నుంచి కూడా మద్దతు లభించకపోవడంతో మావోయిస్టు పార్టీ కకావికలమవుతుంది. మావోయిస్టులు అనుకున్నట్టుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకపోలేదని విమర్శలు కూడా తలెత్తడం ఎందుకు ఓ కారణంగా కనిపిస్తోంది.
వరుస లొంగబాట్లు లొంగుబాట్లు
ఉద్యమం బలహీనపడటం మరియు పతనావస్థ (Decline of the Movement) వరుస లొంగబాట్లు లొంగుబాట్లు, భీకర ఎన్‌కౌంటర్లు, నిత్యం సాయుధ భద్రతా బలగాల నిఘా, అనునిత్యం మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహించడం, కేంద్ర,ఛత్తీస్‌గఢ్రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి చర్యల (ఆపరేషన్ కగార్, సమాధాన్ వ్యూహం వంటివి) కారణంగా మావోయిస్టుల ఉద్యమం తీవ్రంగా బలహీనపడింది. భారీ లొంగుబాట్లు ఇటీవల కాలంలో (సెప్టెంబర్-అక్టోబర్ 2025) వందల సంఖ్యలో మావోయిస్టులు కేంద్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక ఆకర్షణీయ పునరావాస పథకాలు, ఎవరిపై ఉన్న రివార్డులు వారికి ఇచ్చే ప్రక్రియతో మావోయిస్టులు అత్యధికంగా లొంగిపోయేందుకు మొగ్గు చూపుతున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ రూపేశ్ వంటి కీలక అగ్రనేతలతో పాటు 200 మందికి పైగా లొంగుబాటు కావడం ఒక చరిత్రాత్మక పరిణామంగా చెబుతున్నారు.
Also Read: Chhattisgarh: చరిత్రలోనే మావోయిస్టులు అత్యధికంగా.. ఒకే రోజు 120 మంది లొంగుబాటు
కీలక నేతల మృతి
వరుస ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు కేంద్ర కమిటీలోని పలువురు కీలక నాయకులు హతమయ్యారు. దీంతో మావోయిస్టు ప్రభావ ప్రాంతాలు తగ్గిపోయాయి. దండకారణ్యం, ముఖ్యంగా అభూజ్‌మఢ్ వంటి ప్రాంతాలు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ప్రాంతాలలో కూడా భద్రతా దళాల పట్టు పెరిగింది. మావోయిస్టుల అలికిడి గణనీయంగా తగ్గింది. కొన్ని ప్రాంతాలు నక్సల్ ప్రభావం నుంచి విముక్తమైనట్లు (Naxal-free) అధికారులు ప్రకటించారు.
అంతర్గత బలహీనతలు నాయకత్వ సంక్షోభం, లోపలి విభేదాలు, కొత్త తరం నాయకత్వం ఎదగకపోవడం వంటి అంతర్గత సమస్యలు కూడా మావోయిస్టు ఉద్యమాన్ని దెబ్బతీశాయి.
ప్రభుత్వ వ్యూహం (Government Strategy), ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని (Two-pronged strategy) అనుసరిస్తోంది. అంతే స్థాయిలో అటు కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్టుల అణచి వేతకు ప్రత్యేక ప్రణాళికను రచించి ముందుకు సాగుతోంది. భద్రతా చర్యలు (Security Measures), భద్రతా దళాల (DRG, STF, CRPF,) కోబ్రా) ఆధ్వర్యంలో కూంబింగ్ ఆపరేషన్లను, ఎన్‌కౌంటర్లను ముమ్మరం చేయడంతో మావోయిస్టు పార్టీ అంతమయ్యే దిశగా ప్రస్ఫుటమవుతుంది.
నక్సల్ రహిత భారత్’ లక్ష్యం
2026 మార్చి నాటికి నక్సలిజాన్ని దేశం నుంచి పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. స్వచ్ఛందంగా లొంగిపోయే మావోయిస్టులకు అభివృద్ధి & పునరావాసం (Development & Rehabilitation) కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఆకర్షణీయమైన పునరావాస పథకాలను (ఉదా: ‘నియత్ నెల నార్’ పథకం) మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఒకప్పుడు మావోయిస్టుల అదుపులో ఉన్న ప్రాంతాల్లో రోడ్లు, మొబైల్ టవర్లు, బ్యాంక్ శాఖలు వంటి మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలను చేరువ చేస్తోంది. ప్రస్తుతానికి, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రభావం మునుపటితో పోలిస్తే గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం తీసుకుంటున్న భద్రతా, అభివృద్ధి చర్యలు విజయం సాధిస్తున్నాయని, మావోయిస్టు ఉద్యమం ముగింపు దశకు చేరుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, దండకారణ్యంలోని కొన్ని అంతర్గత ప్రాంతాలలో వారి ఉనికి ఇప్పటికీ సవాళ్లను విసురుతోంది.
Also Read: Chhattisgarh: మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేలి జవాన్‌కు తీవ్ర గాయాలు
