Chattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో 28 మంది మావోయిస్టులు మృతి చెందగా, చాలామందికి గాయాలైనట్టు తెలుస్తోంది. మాధ్ ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాల ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ DRG బలగాలు పాల్గొన్నాయి. ఇవాళ (బుధవారం) ఉదయం నుండే భద్రతా బలగాలు, నక్సల్స్‌కి మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.
మృతుల్లో మావోయిస్టు అగ్రనేత
నారాయణ పూర్ జిల్లాలోని ఆబుజ్మడ్ లోని బటైల్ అడవుల్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నట్లు సమాచారం. అతడిపై రూ. కోటిన్నర వరకూ రివార్డ్ ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఎన్ కౌంటర్ ను నారాయణ పూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధ్రువీకరించడం గమనార్హం.
మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో కేశవరావు సహా మరో 30 మంది మావోయిస్టులు హతం
మావోయిస్టులకు ఇది మరో భారీ ఎదురుదెబ్బ https://t.co/d15sZtbcm1 pic.twitter.com/9T7MuvkJ1S
— BIG TV Breaking News (@bigtvtelugu) May 21, 2025
Also Read: YouTuber Jyothi malhotra: జ్యోతి మల్హోత్రా డైరీలో షాకింగ్ నిజాలు.. స్పై మూవీని తలదన్నేలా కోడింగ్ భాష!
సుప్రీం కమాండర్‌గా..
ఎన్ కౌంటర్ లో మరణించిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు విషయానికి వస్తే.. ఆయన మావోయిస్టులకు సుప్రీం కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. గణపతి రాజీనామాతో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. నంబాల స్వస్థలం ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా జయ్యన్న పేట. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల ఒకరిగా ఉన్నారు. 1970 నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో ఆయన చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అంతటి కీలక నేత ఉన్నారన్న సమాచారంతోనే బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి.