Bihar-Cabinet (Image source Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Bihar Cabinet: బీహార్‌లో ఖరారైన ‘కేబినెట్ ఫార్ములా’!.. సీఎం ఎవరంటే?

Bihar Cabinet: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సునాయాస విజయం సాధించింది. మహాఘట్ బంధన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. అయితే, ఎన్డీయే కూటమిలో జేడీయూ పార్టీ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం, ఎల్జేపీ పార్టీకి కూడా గణనీయ సంఖ్యలో సీట్లు రావడంతో అందరికీ ఆమోదయోగ్యమైన కేబినెట్ కూర్పు ఎలా ఉంటుంది?, సీఎంగా నితీష్ కుమారే ఉంటారా?, లేక, బీజేపీ ఏమైనా ఎత్తుగడలు వేస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితాలు వెలువడి రెండు రోజుల గడుస్తున్నా అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా లేకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.

కేబినెట్ ఫార్ములా ఇదేనా!

కూటమి పార్టీల మధ్య సుధీర్ఘ చర్చల అనంతరం, మరో మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు కూటమి పార్టీల మధ్య కొత్త కేబినెట్ ఫార్ములా కూడా ఖరారైనట్టు సమాచారం. నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో మంత్రివర్గ ఫార్ములా ఖరారైందని అంటున్నారు. దీంతో, నితీష్ కుమారే సీఎంగా కొనసాగుతారని, మరో 3 రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుదని అంటున్నారు.

Read Also- Mother of Satan: ‘మదర్ ఆఫ్ సైతాన్’.. ఢిల్లీ పేలుడుకు వాడిన బాంబు ఇదే!.. అసలేంటీ టీఏటీపీ?

బీజేపీకి 15 మంత్రి పదవులు

మంత్రివర్గ ఏర్పాటు కోసం అనుసరించే ఫార్ములాపై అమిత్ షా సమక్షంలో శనివారం చర్చించారు. నితీష్ కుమార్‌ను తమ నాయకుడిగా ఆమోదించేందుకు బీజేపీ నాయకులు ప్రారంభంలో విముకత చూపినా, చివరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, మంత్రివర్గంలో బీజేపీకి అధిక ప్రాధాన్యత లభించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత జేడీయూకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక, చిన్న మిత్రపక్షాలకు కూడా కేబినెట్‌లో చోటు కల్పించాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి అనే ఫార్ములాను అనుసరించాలనే నిర్ణయించినట్టు కూటమి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఫార్ములా ప్రకారం చూస్తే, బీజేపీకి 15 నుంచి 16 వరకు మంత్రి పదవులు దక్కుతాయి. ఇక, జేడీయూకి 14, లోక్ జనశక్తి పార్టీకి 3, హిందుస్తానీ అవామ్ మోర్చా పార్టీకి 1, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి 1 చొప్పున మంత్రి పదవులు లభించే అవకాశాలు ఉన్నాయి.

Read Also- Delhi Blast Case: ఢిల్లీ పేలుడుకు పాల్పడ్డ మొహమ్మద్ ఉమర్ అకౌంట్‌లో ఎంత డబ్బు పడిందో గుర్తించిన అధికారులు

మోదీ షెడ్యూల్‌ను బట్టి తేదీ ఖరారు

బీహార్ ఎన్డీయే ప్రభుత్వ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అధికారికంగా ఎలాంటి తేదీ ఖరారు కాలేదు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్‌పై ఆధారంగా తేదీని ఖరారు చేస్తారని సమాచారం. బుధవారం, లేదా గురువారం ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉండొచ్చని కూటమి వర్గాలు తెలిపాయి. కాగా, బీహార్‌లో 18వ అసెంబ్లీ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో, ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ఊపందుకోనుంది. సీఎం నితీష్ కుమార్ సోమవారం నాడు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ భేటీలో 17వ అసెంబ్లీ రద్దుకు ఆమోదం తెలపనున్నారు. ఈ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత రాష్ట్ర గవర్నర్ ఖాన్‌కు తన రాజీనామాను లేఖను అందించనున్నారు. దాంతో, ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. సీఎం రాజీనామా తర్వాత ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నూతన ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటాయి.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో చకచకా పనులు జరుగుతున్నాయి. నితీష్ కుమార్ రికార్డ్ స్థాయిలో 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమికి చెందిన కీలక నేతలు హాజరవుతాయని సమాచారం. కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అఖండ విజయం సాధించింది. రాష్ట్రంలో మొత్తం 243 సీట్లు ఉండగా కూటమికి ఏకంగా 202 స్థానాలు దక్కాయి. జేడీయూ, బీజేపీ పార్టీలు 2020 కంటే ఎక్కువ సీట్లు సాధించాయి. 89 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూకు 85 స్థానాలు వచ్చాయి. ఇక, ఎల్జేపీ, హెచ్ఏఎం, ఆర్‌ఎల్ఎం వంటి చిన్నపార్టీలు కీలక భాగస్వాములుగా ఉన్నాయి.

Just In

01

Cyber Crime: హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ పేరుతో ఫేక్ ఖాతాలు

Varanasi Release Date: మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా విడుదల అప్పుడేనా.. ఎందుకు అంత లేట్..

Bride Murder: చీర విషయంలో ఘర్షణ.. పెళ్లికి గంట ముందు పెళ్లికూతుర్ని చంపేసిన కాబోయేవాడు

Telangana RTA: ఫ్యాన్సీ నెంబర్లకు రేట్లు ఫిక్స్‌.. ఆర్టీఏ ఆదాయం పెంపునకు కీలక నిర్ణయం!

ACB Raids: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు.. భారీగా నగదు, డాక్యుమెంట్ల స్వాధీనం