Mother-of-Satan-Bomb (Image source Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Mother of Satan: ‘మదర్ ఆఫ్ సైతాన్’.. ఢిల్లీ పేలుడుకు వాడిన బాంబు ఇదే!.. అసలేంటీ టీఏటీపీ?

Mother of Satan: ఢిల్లీ పేలుడు (Delhi Blast) సంభవించినప్పుడు ఎర్రకోట ప్రాంతం దద్దరిల్లింది. పేలుడు ప్రభావానికి చుట్టుపక్కల కొన్ని మీటర్ల పరిధిలో ఉన్న వాహనాలు కాలిబూడిద అయిపోగా, సమీపంలోని ఇళ్ల అద్దాలు పగిలాయి. ఇంత శక్తివంతమైన పేలుడు వెనుకున్న పదార్థాలు ఏమిటి?, మొహమ్మద్ ఉమర్ ఏ బాంబును వినియోగించాడనే దానిని గుర్తించేందుకు దర్యాప్తు అధికారులు కృషి చేస్తున్నారు. అయితే, ఢిల్లీ పేలుడులో ‘మదర్ ఆఫ్ సైతాన్’ అని (Mother of Satan) పిలిచే అత్యంత ప్రమాదకరమైన బాంబుని వాడి ఉండొచ్చని ఫోరెన్సిక్ నిపుణులు అనుమానిస్తున్నారు. ట్రైయాసిటోన్ ట్రైపెరాక్సైడ్‌తో (TATP) తయారు చేసిన బాంబును వాడి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనికి అస్థిర లక్షణాలు ఉంటాయని అంటున్నారు. డిటోనేటర్ లేకుండా కేవలం వేడితో పేలగలదని అధికారులు చెబుతున్నారు. అయితే, నిజంగానే ఈ పేలుడుకు కారణం టీఏటీపీ ఉందా అని నిర్ధారించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామని ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొన్నారు. టీఏటీపీకి ఉండే అస్థిర స్వభావం గురించి ఉమర్‌కు తెలుసని, అయినప్పటికీ అతడు జనాలు ఎక్కువగా ఉండే ఏరియాలోకి ప్రవేశించాడని దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. కారు పేలుడు జరిగిన ప్రాంతం ఓల్డ్ ఢిల్లీలో జనసాంద్రత చాలా ఎక్కువగా ఉండే చాందినీ చౌక్‌కు పక్కనే ఉంది.

Read Also- Jogulamba Gadwal: గ్రామాల్లో గజ్జుమనిపిస్తున్న గ్రామ సింహాలు.. జిల్లాలో ఐదు నెలల్లోనే 720 కేసులు నమోదు

సున్నితమైన బాంబు

టీఏటీపీని మదర్ ఆఫ్ సైతాన్‌ అని పిలవడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇది అత్యంత సున్నితమైన స్వభావం ఉన్న బాంబు అని నిపుణులు చెబుతున్నారు. రాపిడి, ఒత్తిడి, ఉష్ణోగ్రత పెరిగినా, మొత్తంగా చెప్పాలంటే భౌతిక వాతావరణంలో ఏ చిన్న మార్పు సంభవించినా పేలుడుకు దారితీస్తుంది. ఇది డిటోనేటర్ కూడా అవసరం లేకుండానే పేలిపోతుందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా బాంబులు తయారు చేసేవారు దీనిని విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. అందుకే, దీనిని ‘మదర్ ఆఫ్ సైతాన్’ అనే పేరు వచ్చిందని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో దీనిని వాడారు. 2017 బార్సిలోనా దాడులు, 2015 పారిస్ దాడులు, 2017 మాంచెస్టర్ బాంబు దాడి, అంతేకాదు 2016 బ్రస్సెల్స్ జరిగిన బాంబు దాడుల్లో కూడా ఈ బాంబు ఆనవాలళ్లను గుర్తించారు. ఈ బాంబును తయారు చేసేవారికి ఏదో ఒక రూపంలో ఉగ్రవాద ట్రైనింగ్ తీసుకునే ఉంటారని భావిస్తారు.

Read Also- KTR: భవిష్యత్ లో జూబ్లీహిల్స్ లో మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తాం : కేటీఆర్

ఢిల్లీ పేలుడులో వాడినట్టేనా?

ఢిల్లీ పేలుడు జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తే, టీఏటీపీ మాదిరి నష్టం, ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే, నిర్ధారణ కోసం టీఏటీపీ ఆనవాళ్లను నిర్ధారించడానికి ఫోరెన్సిక్ బృందాలు అవశేషాలను విశ్లేషిస్తున్నాయి. పేలుడు తీవ్రతను బట్టి, పేలుడు పదార్థం వాహనం లోపల వేడికి గురై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరింత భారీ ఉగ్రవాద ఆపరేషన్ కోసం బాంబు తీసుకెళుతుండగా ప్రమాదవశాత్తు పేలిపోయిందా? అనే కోణంలో కూడా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా పరిశీలనలు చేస్తున్నారు. పేలుడుకు ముందు కూడా ఓల్డీ ఢిల్లీలో రద్దీ ప్రాంతాల గుండా చాలాసేపు కారును డ్రైవ్ చేశాడు. మరి, టీఏటీపీతో తయారు చేసిన బాంబైతే అన్ని గంటలపాటు కారులో ఏవిధంగా స్థిరంగా ఉందనేది కూడా సందేహాస్పదంగా ఉంది.

ఇక, టీఏటీపీ తయారీకి పలు రకాల పదార్థాలు అవసరం అవుతాయని, ఉమర్ ఆ రసాయనాలను ఏవిధంగా సేకరించాడో కూడా తెసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఏదైనా నెట్‌వర్క్ నుంచి సపోర్ట్‌తో కెమికల్స్ అందాయా?, పేలుడు పదార్థం తయారీలో ఇతర వ్యక్తులు ఎవరైనా పాల్గొన్నారా? అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. దీంతో, పేలుడుకు ముందు ఉమర్ ఏమేం చేశాడనే వివరాల క్రమాన్ని రూపొందిస్తున్నారు. డిజిటల్ యాక్టివిటీస్, కదలికలు, కమ్యూనికేషన్‌కు సంబంధించిన ప్రతి చిన్న వివరాన్ని కూపీ లాగుతున్నారు.

 

Just In

01

Varanasi Release Date: మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా విడుదల అప్పుడేనా.. ఎందుకు అంత లేట్..

Bride Murder: చీర విషయంలో ఘర్షణ.. పెళ్లికి గంట ముందు పెళ్లికూతుర్ని చంపేసిన కాబోయేవాడు

Telangana RTA: ఫ్యాన్సీ నెంబర్లకు రేట్లు ఫిక్స్‌.. ఆర్టీఏ ఆదాయం పెంపునకు కీలక నిర్ణయం!

ACB Raids: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు.. భారీగా నగదు, డాక్యుమెంట్ల స్వాధీనం

Andhra King Taluka: రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి..