VVPAT Slips: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ గురువారం (నవంబర్ 6) పూర్తయింది. మొత్తం 243 స్థానాలకుగానూ 121 సీట్లకు జరిగిన తొలి దశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 64.69 శాతం ఓటింగ్ శాతం నమోదయింది. తమకే అనుకూలంగా ఓట్లు పడ్డాయని ఎన్డీయే కూటమి, మహాఘట్‌బంధన్ నేతలు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 11న రెండవ విడత పోలింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో శనివారం షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో ఒకచోట రోడ్డు పక్కన పెద్ద సంఖ్యలో వీవీప్యాట్ (VVPAT) స్లిప్‌లు కనిపించాయి. సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఒక కాలేజీకి సమీపంలో పెద్ద సంఖ్యలో చెల్లాచెదురుగా పడి (VVPAT Slips) ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో, ఈ వ్యవహారం ఎన్నికల అధికారుల వెంటనే రంగంలోకి దిగారు.
Read Also- Mana Shankara Vara Prasad Garu: వైరల్ సెన్సేషన్.. మరో బెంచ్‌మార్క్‌కు చేరుకున్న ‘మీసాల పిల్ల’!
ఈ నిర్వాకానికి పాల్పడ్డ ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఆయనను సస్పెండ్ చేయడంతో పాటు కేసు కూడా నమోదు చేసినట్లు ఒక ప్రకటన చేశారు. ఈ విషయంపై విచారణ జరిపి, ఆ ప్రాంతాన్ని తనిఖీ చేయాలంటూ జిల్లా మేజిస్ట్రేట్‌ను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఇవి మాక్ పోలింగ్‌కు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్‌లు కాబట్టి, పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి లోపం లేదని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులకు కూడా తెలియజేశామని వివరించింది. అయినప్పటికీ, నిర్లక్ష్యం వహించిన ఏఆర్‌వోను సస్పెండ్ చేయడంతో పాటు, అతడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తున్నట్టు ఈసీ వివరించింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని అధికారులు తెలిపారు.
Read Also- Wine Shops Closed: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. హైదరాబాద్‌లో మూడు రోజులు వైన్స్ బంద్..?
