Ilham Aliyev
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Azerbaijan on India: భారత్ మా దేశాన్ని పగబట్టింది.. అజర్‌బైజాన్ సంచలన ఆరోపణ

Azerbaijan on India: పాకిస్థాన్‌కు అత్యంత స్నేహపూర్వక దేశమైన అజర్‌బైజాన్.. భారత్‌పై (Azerbaijan on India) సంచలన ఆరోపణలు చేసింది. పాకిస్థాన్‌తో తమ సన్నిహిత సంబంధాల కారణంగా భారత్ తమ దేశంపై పగబట్టిందని, అంతర్జాతీయ వేదికలపై అజర్‌బైజాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటోందని విమర్శించింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో (SCO) పూర్తిస్థాయి సభ్యత్వాన్ని పొందాలనుకున్న తమ ప్రయత్నాన్ని భారత్‌ అడ్డుకుందని నిందలు వేసింది. ఈ మేరకు ఆ దేశ మీడియాలో విస్తృతంగా కథనాలు వెలువడుతున్నాయి. ఎస్‌సీవో సభ్యత్వాన్ని అడ్డుకోవడం ద్వారా అజర్‌బైజాన్ బహుళ పక్షాల దౌత్య లక్ష్యాలను ఇండియా అడ్డుకుందని, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు తాము మద్దతు ఇవ్వడంతోనే భారత్ ఈ విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది.

భారత వ్యతిరేక ధోరణి
అజర్‌బైజాన్ చాలాకాలంగా భారత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోంది. తాజాగా, చైనాలోని తింజియాన్‌లో జరిగిన షాంఘై సదస్సులో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ భేటీ అయ్యారు. ఈ ఏడాది మే నెలలో భారతదేశంతో జరిగిన సైనిక సంఘర్షణలో పాకిస్థాన్ విజయం సాధించిందంటూ అభినందనలు తెలిపారు. భారత్‌ చర్యలతో ఎలాంటి సంబంధం లేకుండా పాకిస్థాన్‌తో ఉన్న ‘సోదర బంధాన్ని’ తమ దేశం కొనసాగిస్తుందని అలియేవ్ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో తమ దేశ రాజకీయ, సాంస్కృతిక, వ్యూహాత్మక సంబంధాలు చాలా పటిష్టంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అజర్‌బైజాన్-పాకిస్థాన్ మధ్య ఉన్న ఇంటర్‌గవర్నమెంటల్ కమిషన్ ద్వారా వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించే అంశంపై కూడా ఇరుదేశాధినేతలు చర్చించుకున్నారని తుర్కియేకు చెందిన దినపత్రిక ‘డైలీ సాబాహ్’ తెలిపింది.

Read Also- PM Modi: నా తల్లిని తిట్టారు.. నన్ను అవమానించారు.. ప్రధాని ఎమోషనల్

మీడియాలో విస్తృతంగా కథనాలు

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో (SCO) పూర్తిస్థాయి సభ్యత్వం తీసుకోవాలనుకున్న అజర్‌బైజన్ ఆశలపై భారత్ మరోసారి నీళ్లు చల్లిందంటూ ఆ దేశ మీడియాలో జోరుగా కథనాలు వెలువడుతున్నాయి. ఎస్‌సీవోకు చేసిన అభ్యర్థనను భారతదేశం మళ్లీ అడ్డుకుందని అజర్‌బైజాన్‌కు చెందిన టీవీ ప్రసార సంస్థ ఏన్యూస్‌జెడ్ (AnewZ) భారత్‌పై తీవ్ర విమర్శలు చేసింది. ‘‘ఎస్‌సీవో పూర్తి సభ్యత్వం తీసుకోవాలనుకున్న అజర్‌బైజాన్‌కు భారతదేశం మళ్లీ అడ్డుతగిలింది’’ అని పేర్కొంది. మరోవైపు, అర్మేనియాతో దౌత్య సంబంధాలను పరిశీలినకు పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం అజర్‌బైజాన్ శాంతి ప్రణాళికలో భాగమేనని, తమ దేశం సమన్వయం చేసినదేనని తెలిపింది.

Read Also- Kim Jong-un: ట్రైన్‌లో చైనా బయలుదేరిన ఉత్తరకొరియా అధినేత కిమ్.. కీలక పరిణామం జరగబోతోంది!

పాకిస్థాన్‌కు అజర్‌బైజాన్ మొదటి నుంచి బలంగా మద్దతుగా నిలుస్తంది. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ అదే చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో, ఒక ప్రకటన విడుదల చేసిన అజర్‌బైజాన్.. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత పెరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొంది. కానీ, పాకిస్థాన్‌కు మద్దతు తెలిపింది.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం