Air India Flights (Image Source: Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Air India Flights: ఎయిర్ ఇండియా కీలక ప్రకటన.. ఆ దేశాలకు మళ్లీ విమాన సేవలు!

Air India Flights: ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన యుద్ధం (Iran and Israel War).. యావత్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఇరుదేశాలు వైమానిక దాడులకు తెగబడటంతో.. మధ్య ప్రాచ్యంలో విమానరాకపోకలపై పెను ప్రభావం పడింది. దీంతో ఖతార్, బెహ్రెయిన్ అనేక గల్ఫ్ దేశాలు.. తమ ఎయిర్ స్పేస్ (Middle East Airspace)ను మూసివేయడంతో పలు విమానయాన సంస్థలు.. మధ్యప్రాచ్యం గుండా ప్రయాణించే విమానాలను రద్దు చేశాయి. ఇందులో భారత్ కు చెందిన ఎయిర్ ఇండియా సంస్థ కూడా ఉంది. అయితే ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) స్వయంగా ప్రకటించడంతో.. ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

విమానాల సేవలకు గీన్ సిగ్నల్
ఇరాన్ – ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో మధ్యప్రాచ్యం మీదుగా యూరప్ వెళ్లే విమాన సేవలను ఎయిర్ ఇండియా రద్దు చేసిన సంగతి తెలిసిందే. గత 12 రోజులుగా విమాన సేవలను ఎయిర్ ఇండియా నిలిపివేసింది. తాజాగా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ ప్రకటించడం, మిడిల్ ఈస్ట్ ఎయిర్ స్పేస్ ఓపెన్ కావడంతో.. నేటి నుంచి యూరప్ వెళ్లే విమానాలకు ఎయిర్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 25 నుంచి చాలా విమాన కార్యకలాపాలు తిరిగి సాధారణ పరిస్థితికి చేరుతాయని బహిరంగ ప్రకటన విడుదల చేసింది. గతంలో రద్దు చేసిన యూరప్ ఫ్లైట్స్ ను సైతం పునరుద్ధరించనున్నట్లు స్పష్టం చేసింది.

Also Read: Prabhas: ప్రభాస్ కెరీర్ లోనే బిగ్ రికార్డ్.. కన్నప్ప కోసం అన్ని రోజులు కాల్ షీట్స్ ఇచ్చాడా?

ప్రయాణికులకు హామీ
అమెరికా ఈస్ట్ కోస్ట్ (US East Coast), కెనడాకు వీలైనంత త్వరగా విమాన సేవలను తిరిగి ప్రారంభిస్తామని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలియజేశారు. విమాన కొన్ని విమానాలు ఆలస్యం, రద్దు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. రూట్‌ ప్రభావం, విమాన ప్రయాణ సమయం పెరగడం వల్లనే ఈ సమస్య ఎదురైందని పేర్కొంది. అయినప్పటికీ ఎయిర్‌ ఇండియా అంతరాయాన్ని తగ్గించడానికి, విమాన షెడ్యూల్‌ను సాధారణ పరిస్థితికి తీసుకువచ్చేందుకు కట్టుబడి ఉందని హామీ ఇచ్చింది. విమాన ప్రయాణాలకు సంబంధించిన ఏ విధమైన అప్ డేట్స్ అయినా క్రమం తప్పకుండా తెలియజేస్తామని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.

Also Read This: USA – India: భారత్‌లోని అమెరికన్లకు బిగ్ వార్నింగ్.. ట్రంప్ సర్కార్ సంచలన ఆదేశాలు

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?