Chatgpt (Image Source: Twitter)
లేటెస్ట్ న్యూస్, లైఫ్‌స్టైల్

Chatgpt: చాట్ జీపీటీ సాయంతో 18 కేజీలు తగ్గిన యువతి.. ఏందయ్యా ఈ అద్భుతం!

Chatgpt: ప్రస్తుత రోజుల్లో అధిక బరువు సమస్య చాలా మందిని వేదిస్తోంది. దీంతో బరువు తగ్గేందుకు జిమ్, డైట్ వంటి మార్గాలను యువత ఎంచుకుంటోంది. గంటల కొద్ది జిమ్ లో కష్టపడటంతో పాటు.. డైట్ పేరుతో నోరు కట్టేసుకుంటోంది. ఇదేంటని ప్రశ్నిస్తే.. బరువు తగ్గాలంటే ఆ మాత్రం కష్టపడాల్సిందేనంటూ ఈ జనరేషన్ యూత్ సమాధానం ఇస్తోంది. అయితే ఓ మహిళ ఇవేమి లేకుండానే ఇంట్లోనే ఉంటూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గింది. ఇందుకు చాట్ జీపీటీ సాయం తీసుకుంది. తన విజయానికి కారణమైన చిట్కాల గురించి పంచుకుంటూ సదరు యువతి పెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె పాటించిన టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

సులభమైన చిట్కాలు
ఆర్య అరోరా అనే యువతి.. జిమ్ వర్కౌట్స్, ఫ్యాన్సీ డైట్ ఏమీ చేయకుండానే 18 కేజీల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. బరువు తగ్గడానికి ముందు, ఆ తర్వాత అంటూ జూన్ 17న ఆమె పోస్ట్ చేసిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బరువు తగ్గడానికి ముందు ఎంతో లావుగా ఉన్న ఆమె.. స్లిమ్ అయిన తర్వాత అచ్చం హీరోయిన్ లాగా మారిపోయింది. బరువు తగ్గాలన్న తన లక్ష్యాన్ని చేరుకోవడానికి 7 చిట్కాలు ఫాలో అయినట్లు ఆర్య తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొంది. ఈ సులభమైన చిట్కాలు పాటిస్తే ఎవరైన స్లిమ్ గా మారిపోవచ్చన్న సంకేతాలు ఇచ్చింది.

1. జీవక్రియ రేటు (BMR)ని లెక్కించండి
ఆర్య బరువు తగ్గే క్రమంలో ముందుగా శరీరానికి అవసరమైన కేలరీల గురించి అర్థం చేసుకోవడం ప్రారంభించింది. ఇందుకు చాట్ జీపీటీ సాయాన్ని తీసుకుంది. తన బరువు, ఎత్తు, వయసు, స్త్రీ/పురుషుడు వంటి వివరాలను చాట్ జీపీటీలో నమోదు చేసింది. తద్వారా తన జీవక్రియ రేటు (BMR) ఎంత? బరువు తగ్గడానికి కేలరీ ఇంటేక్ ఎంత? అని చాట్ జీపీటీని కోరింది. తన శరీరాకృతిని బట్టి ఏఐ ఇచ్చిన డేటాతో సరైన కేలరీ లక్ష్యాన్ని ఆర్య నిర్దేశించుకుంది.

2. సమతూల్యమైన ఆహారం
బరువు తగ్గే క్రమంలో ఆర్య.. ఏ ఆహారాన్ని మానేయలేదు. అయితే శరీరానికి అవసరమైన మోతాదుకు వాటిని సమతుల్యం చేసింది. తినే ప్రతీ ఫుడ్ లో 40% ప్రోటీన్, 30% ఫైబర్, 20% కార్బోహైడ్రేట్లు, 10% కొవ్వు పదార్థాలు ఉండేలా జాగ్రత్తపడింది. ఇలా సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉండటమే కాకుండా ఎంతో ఉత్సాహాంగా ఉండేందుకు వీలు కలిగిందని ఆర్య చెప్పారు.

3. బరువు తగ్గడమే కాదు.. శక్తిని మెరుగుపరుచుకోండి
ఆర్య.. వారంలో తను చేసిన వర్కౌట్స్ వివరాలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.

– 4 రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్
– 2 రోజులు కార్డియో
– చురుగ్గా ఉండేందుకు ప్రతీ రోజు నడక

ఇలా చేస్తే మీ కండరాలు దృఢంగా మారడంతో పాటు వేగంగా శరీరంలోని కొవ్వు కరిగిపోతుందని ఆర్య తెలిపింది.

4. కాలరీలను ట్రాక్ చేయడం
ఆర్య ఒక వారంపాటు తన ఆహారాన్ని ట్రాక్ చేసింది. తీసుకునే ప్రతీ బైట్ పై దృష్టిపెట్టడం తన ఉద్దేశం కాదని, తన ఆహార అలవాట్లను బాగా అర్థం చేసుకోవడం కోసం ఇలా చేశానని తెలిపింది.

5. జంక్‌ను కట్ చేయండి.. కానీ పూర్తిగా కాదు!
జంక్ ఫుడ్ విషయంలో 80:20 నియమాన్ని ఆర్య పాటించింది. తినే ఫుడ్ లో జంక్ ఫుడ్ శాతాన్ని 20 శాతానికి పరిమితం చేసింది. ప్రాసెస్ చేసిన ఫుడ్, చక్కెర, పిండి, నూనె పదార్థాలు, ఫ్రై చేసిన ఫుడ్ ను తీసుకోవడం ఆమె తగ్గించింది. ఆహారంలో సమతుల్యతకు ప్రాధాన్యం ఇచ్చింది.

6. హైడ్రేట్ గా ఉండటం.. కావాల్సిన నిద్ర
బరువు తగ్గే క్రమంలో రోజుకు 2-3 లీటర్ల నీరు, 7-8 గంటల నాణ్యమైన నిద్రను పాటించినట్లు ఆర్య తెలిపింది. ఇలా చేయడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరగడంతో పాటు జీర్ణ క్రియ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పింది.

7. హార్మోన్స్ – మైండ్ సెట్
బరువు తగ్గడంలో మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనదని ఆర్య తెలిపింది. ఇందుకోసం క్రమం తప్పకుండా డైరీ రాయడం, ధ్యానం చేయడం, కృతజ్ఞతా భావంతో ఉండటం వంటివి పాటించినట్లు చెప్పారు. ఇలా చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉండటంతో పాటు హార్మోన్స్ లోని అసమతుల్యత కూడా తొలిగిపోతుందని ఆమె పేర్కొంది. ఇది మంచి ఫలితాలకు దారి తీస్తుందని చెప్పింది.

 

View this post on Instagram

 

A post shared by Aryaa Arora (@wutaryaadoin)

గమనిక: ఈ కథనం మీ అవగాహన కోసం మాత్రమే ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు