Air Pollution: ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం ఒక పెద్ద అనారోగ్య సమస్యగా మారింది. ప్రతీ ఏడాది కోట్లు మంది ఈ విష వాయువుల ప్రభావంతో అనారోగ్యానికి గురవుతున్నారు. గాలిలో ఉండే PM2.5, PM10 వంటి సూక్ష్మ కణాలు, నైట్రోజన్ డైఆక్సైడ్ (NO₂), సల్ఫర్ డైఆక్సైడ్ (SO₂), కార్బన్ మోనాక్సైడ్ (CO), పలు రకాల రసాయనాలు మన శరీరాన్ని తీవ్రమైన విధంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ కాలుష్య గాలిని శ్వాస తీసుకునే సమయంలో ఊపిరితిత్తులు, గుండె, మెదడు, రోగనిరోధక శక్తి వంటి అనేక వ్యవస్థలు నష్టపోతున్నాయి. అయితే, దీని వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
వాయు కాలుష్యం వల్ల వచ్చే ప్రధాన సమస్యలు ఇవే..
1. ఆస్తమా (Asthma)
గాలిలోని విషపూరిత కణాలు శ్వాసనాళాల్లోకి పోయి, ఇన్ఫ్లమేషన్, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగిస్తాయి. దీర్ఘకాలికంగా దీనికి గురయ్యే వారు ఆస్తమా తీవ్రత మరింత పెరుగుతుంది.
2. సీఓపిడీ – క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)
దీంట్లో క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫైసీమా వంటి వ్యాధులు ఉంటాయి. విష సూక్ష్మకణాలు ఊపిరితిత్తుల కణజాలాన్ని నాశనం చేసి, గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. ఇది శ్వాసను కష్టతరం చేస్తుంది.
3. ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer)
వాహనాల కాలుష్యం, పరిశ్రమల నుంచి వచ్చే కార్సినోజెనిక్ కెమికల్స్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని అనేక రెట్లు పెంచుతున్నాయి. ధూమపానం చేయని వారికీ కూడా దీర్ఘకాలిక వాయు కాలుష్యం కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
Also Read: Nayanthara in NBK111: బాలయ్య బాబు సరసన నాలుగోసారి హీరోయిన్గా నటించనున్న ఇండియన్ క్వీన్.. ఎవరంటే?
4. గుండె సమస్యలు (Heart Disease)
వాయు కాలుష్యంలోని కణాలు రక్తనాళాలను దెబ్బతీసి, రక్తపోటును పెంచి, ధమనులను మందపరుస్తాయి. దీని వల్ల గుండెపోటు, అరిత్మియా, హార్ట్ ఫెయిల్యూర్ వంటి తీవ్ర సమస్యలు వస్తాయి.
5. స్ట్రోక్
కాలుష్యం వల్ల రక్తప్రసరణలో మార్పులు, మెదడు రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ ఏర్పడి స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. అధిక కాలుష్య నగరాల్లో నివసించే వారికి ఈ ప్రమాదం ఇంకా ఎక్కువ.
6. న్యుమోనియా (Pneumonia)
ప్రధానంగా పిల్లలు, వృద్ధులు దీని ప్రభావానికి గురవుతారు. కాలుష్య గాలి రోగనిరోధక శక్తిని బలహీనపరచడంతో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు పెరిగి న్యుమోనియా వస్తుంది.
7. అలర్జిక్ రైనిటిస్ (Airborne Allergies)
కాలుష్యం వలన పొగాకు, పొగ, ధూళి పై సెన్సిటివిటీ పెరుగుతుంది. దీని వల్ల సీనింగ్, ముక్కు కారడం, సైనస్ సమస్యలు, శ్వాసలో ఇబ్బందులు వస్తాయి.

