Potatoes: “ఆరోగ్యం మహాభాగ్యం” అని మన పెద్ద వాళ్ళు కూడా చెబుతుంటారు. కానీ, ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపించడం లేదు. ముఖ్యంగా, ఆహారపు అలవాట్ల విషయంలో మితముగా ఆలోచించడం చాలా అరుదుగా మారింది. బంగాళదుంపలను ఎక్కువగా తింటే శక్తి పెరుగుతుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ వైద్య నిపుణుల ప్రకారం, వీటిని మితంగా మాత్రమే తీసుకోవడం మంచిది. అధికంగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు అని వైద్యులు తెలిపారు.
బంగాళదుంపలు ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. ముఖ్యంగా ఆలు చిప్స్, ఫ్రైడ్ వేరియంట్లు ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం మరింత ఎక్కువ అవుతుంది. కొవ్వు శాతం పెరగడం, అధిక చక్కర స్థాయిలు, రక్తపోటు (BP) సమస్యలు, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా.. వాతాన్ని పెంచే స్వభావం కారణంగా కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు వంటి సమస్యలు వేధిస్తాయి.
డయాబెటిస్ ఉన్నవారికి బంగాళదుంపలు పూర్తిగా నివారించడమే మంచిది. అధిక కార్బోహైడ్రేట్ల కారణంగా చక్కర స్థాయిలు వేగంగా పెరుగుతూ, షుగర్ రక్తంలో ప్రమాదకర స్థాయికి చేరుతుంది. కాబట్టి, ఏ ఆహారం అయినా మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. వైద్యులు సూచించినట్లుగా, బంగాళదుంపలను రోజువారీ పరిమాణంలో మాత్రమే తీసుకోవడం, శక్తినిస్తూ కూడా ఆరోగ్యాన్ని కాపాడే మార్గం. మొత్తం బంగాళదుంపలు మితంగా తింటే శక్తి పెంచుతాయి. మితిమీరిన వాడకంలో అయితే ఆరోగ్యానికి హానికరం అవుతుంది. ఆహారంపై సరైన నియంత్రణ, వ్యాయామం, డైట్ అనేవి ఆరోగ్యం కోసం కీలకమని వైద్యులు సూచిస్తున్నారు.
