USA Barge Strikes Bridge In Oklahoma
అంతర్జాతీయం

USA: అమెరికాలో మరో ఘటన, వంతెనను ఢీకొన్న బార్జ్‌

USA Barge Strikes Bridge In Oklahoma: ఈ మధ్య వరుస ఘటనలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా అమెరికాలోని మరో వంతెనకు భారీ ప్రమాదం తప్పింది. బాల్టిమోర్ ఘటన మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

అమెరికాలోని బాల్టిమోర్ వంతెన ప్రమాదాన్ని అక్కడి ప్రజలు మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ఘటన ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.భారత కాలమానం ప్రకారం శనివారం ఓక్లోహోమాలోని ఆర్కన్సాస్ నదిపై వంతెనను భారీ వాహనాలను తరలించే బార్జ్‌ ఢీకొట్టింది.

Read Also: గ్రీస్‌లో వీజాయిస్ట్ బృందం.. ఇన్నోవేషన్ పార్కులపై చర్చలు

దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన స్థానిక పెట్రోలింగ్ బృందాలు సాల్లిసా హైవే దక్షిణ భాగాన్ని మూసివేశాయి. వాహనాలను వేరే దారిలోకి మళ్లించారు. ఈ ఘటనలో బార్జ్‌ దెబ్బతింది. వంతెన పరిస్థితిని అధికారులు క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఇటీవల అమెరికాలోని బాల్టిమోరులో వంతెనను సరుకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయి పలువురు చనిపోయారు.ఈ ఘటనలో నౌకలోని సిబ్బంది మొత్తం కూడా భారత్‌కి చెందిన వారే కావడం కొంత దిగ్భ్రాంతిని కలిగించిన విషయం. ఘటనకు ముందు నౌక విద్యుత్ సరఫరా వ్యవస్థలో అంతరాయాల కారణంగా నియంత్రణ కోల్పోయింది. ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన అధికారులను హెచ్చరించి పలువురి ప్రాణాలను కాపాడిన నౌక సిబ్బందిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రశంసలు కురిపించాడు.

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్