Vjoist group met with the Governor of Thessaly in Greece : భారతదేశం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త కొత్త ఆవిష్కరణలతో స్టార్టప్ కంపెనీలు, ప్రముఖ సంస్థలు ఎప్పటికప్పుడు అబ్బురపరుస్తున్నాయి. అలాగే, దేశ విద్యా రంగంలో కూడా సమూల మార్పులు వస్తున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఒప్పందాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన వీజాయిస్ట్ ప్రతినిధుల బృందం గ్రీస్‌లోని థెస్సాలీలో పర్యటించింది.
వీజాయిస్ట్ చైర్మన్(ఇండియన్ ఇన్వెస్ట్ మెంట్) వేమూరి త్రినాధ్ కిరణ్, ప్రెసిడెంట్ వేమూరి శ్రీరామ్ పవన్, స్ట్రాటజిక్ అడ్వైజర్స్ షితిజ్ దివాన్, గోపాల్ శుక్లా, డైరెక్టర్ చంద్రశేఖర్ రాజేష్, స్ట్రాటజీ లీడ్ దాస్ రిషిత పలువురు ప్రముఖులను కలిసి అనేక చర్చలు జరిపారు. ముందుగా థెస్సాలీ గవర్నర్ కౌరెటాస్‌తో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు.
భారత్‌లో ఇన్నోవేషన్ పార్కుల అభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు, విద్య, వ్యాపార విస్తరణ వంటి అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. అలాగే, జాయిస్ట్ లారిస్సా విస్తరణలో భాగంగా భారత్‌తోపాటు ఇతర చోట్ల ఏర్పాటు చేయాలనుకుంటున్న ఇన్నోవేషన్ పార్కులు, శిక్షణా సదుపాయాల గురించి మాట్లాడుకున్నారు. ఇరు ప్రాంతాల అభివృద్ధికి సహాయ సహకారాలపై చర్చలు జరిపారు.
వీజాయిస్ట్ ప్రతినిధుల బృందంతోపాటు జాయిస్ట్ వ్యవస్థాపకుడు వాసిలియాడిస్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. అలాగే, జాయిస్ట్ లారిస్సా సీఏవో ఆంటోనియోస్ పాలుపంచుకున్నారు. ఇదే టూర్‌లో వీజాయిస్ట్ బృందం లారిస్సా మేయర్ అథనాసియోస్ తోనూ సమావేశమయ్యింది.