Trump On India: అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మూడ్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పడం కష్టమే. ఒక వేదికపై భారత్ ను విమర్శిస్తే.. మరో వేదికపై అనూహ్యంగా ప్రశంసలు కురిపిస్తుంటారు. తాజాగా ఈజిప్ట్ లో జరిగిన ప్రపంచ నాయకుల సదస్సులో భారత్ పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. అది కూడా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వేదికపై ఉండగా భారత్ ను ఆకాశానికెత్తారు. ఇరుదేశాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
‘భారత్ – పాక్ సంతోషంగా ఉండాలి’
గాజాలో ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ముగిసిన సంగతి తెలిసిందే. ట్రంప్ మధ్యవర్తిత్వంలో ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అనంతరం ఈజిప్ట్ లో జరిగిన ప్రపంచ నాయకుల సదస్సులో ట్రంప్ పాల్గొన్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహా పలు దేశాల అధ్యక్షుడు ఈ వేదికలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ పై ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ పేరు ప్రస్తావించకుండానే అతడితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ‘భారత్ గొప్ప దేశం. అగ్రపీఠంపై నా బెస్ట్ ఫ్రెండ్ (ప్రధాని మోదీ) ఉన్నారు. అతడు అద్భుతమైన పని చేశారు. పాక్ – భారత్ చాలా సంతోషంగా కలిసి జీవిస్తాయని నేను అనుకుంటున్నా’ అని ట్రంప్ అన్నారు. అనంతరం వెనుక నిలబడ్డ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను చూస్తూ ఏమంటావ్? అని ట్రంప్ సూటిగా ప్రశ్నించారు. దీంతో ఆయన తడబుడుతూ సరే అన్నట్లుగా చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు.
#WATCH | Egypt | US President Donald Trump says, “India is a great country with a very good friend of mine at the top and he has done a fantastic job. I think that Pakistan and India are going to live very nicely together…”
(Video source: The White House/YouTube) pic.twitter.com/rROPW57GCO
— ANI (@ANI) October 13, 2025
ట్రంప్‌పై పాక్ ప్రధాని ప్రశంసలు
ఇదిలా ఉంటే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను మాట్లాడమని ట్రంప్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ.. ట్రంప్ నిరంతర కృషి ఫలితంగానే మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపన జరిగిందని ప్రశంసించారు. భారత్ – పాక్ యుద్ధాన్ని నిలిపివేయడంతో పాటు గాజాలో ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ జరిగేందుకు ట్రంప్ కృషి చేశారని అన్నారు. కాబట్టి ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలని పాక్ ప్రధాని సూచించారు. దక్షిణాసియా, మధ్యప్రాచ్యంలో లక్షలాది మంది ప్రాణాలను కాపాడినందుకు గాను ట్రంప్ మళ్లీ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఏడాది శాంతి బహుమతి లభించనప్పటికీ.. ట్రంప్ ఇప్పటివరకూ భారత్ – పాక్ సహా మెుత్తం 8 యుద్ధాలను ఆపారని ఆకాశానికెత్తారు.
Also Read: Hyderabad Crime: హైదరాబాద్‌లో ఘోరం.. కవల పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి
మధ్యవర్తిత్వాన్ని అంగీకరించని భారత్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం పదే పదే చెబుతున్నప్పటికీ ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించడం లేదు. ఇరు దేశ సైన్యాల డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చల తర్వాతనే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని భారత్ తేల్చి చెప్పింది. అటు ప్రధాని మోదీ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కాగా ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆనంతరం భారత సైన్యం.. ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి పాక్ లోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది. అమాయకులను పొట్టనపెట్టుకున్న ముష్కరులను సైతం వేటాడి, వెంటాడి హత మార్చింది.
