Fake Voters Scam (imagecredit:twitter)
తెలంగాణ, హైదరాబాద్

Fake Voters Scam: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫేక్ ఓటర్ల జాబితా కలకలం

Fake Voters Scam: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫేక్ ఓటర్ల జాబితా కలకలం సృష్టిస్తుంది. ప్రధానంగా హాస్టళ్లు, పీజీ కేంద్రాల్లో ఈ ఫేక్ ఓటర్లు అత్యధికంగా ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ ఓటర్ల జాబితా అవ‌క‌త‌వ‌క‌లు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం గమనార్హం. ఈ నియోజ‌క‌వ‌ర్గ పరిధిలో 2018 నుంచి సుమారు 12 వేల‌ నకిలీ ఓట్లు ఉన్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ, వెంగళరావు నగర్‌లోని సుమారు 200కి పైగా హాస్టల్స్, పీజీల కేంద్రాలుగానే ఈ బూటకపు ఓటర్ల దందా నడిచిందని తాజాగా ఆరోపణలు వెల్లువెత్తాయి. మ‌రోవైపు ఇటీవ‌ల విడుద‌లైన‌ ముసాదా ఓట‌ర్ల జాబితాలో తీవ్రమైన‌ అవ‌క‌త‌వ‌క‌ల‌ను గుర్తించిన‌ అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల సంఘానికి కూడా ఫిర్యాదు చేయ‌డం గమనార్హం. అయితే న‌కిలీ ఓట‌ర్ల న‌మోదు వ్యవ‌హారంలో హాస్టల్స్ అసోసియేషన్‌లోని ఓ కీలక వ్యక్తి పాత్ర ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా ఆయన మాగంటి ఫ్యామిలీకి అతి సన్నిహితంగా ఉంటారనే ప్రచారం ఉన్నది.

రెండు పార్టీల మ‌ధ్య ఒప్పందం..

ఈ న‌కిలీ ఓట‌ర్లు గ‌త మూడు ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్(BRS) విజయానికి దోహ‌ద‌ప‌డ్డార‌ని కాంగ్రెస్(Congress) చెబుతున్నది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ న‌కిలీ ఓట‌ర్ల బాగోతానికి బీజేపీ(BJP) కూడా పూర్తీగా స‌హ‌కరించింద‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. గ‌త లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ ప‌రిధిలోకి వ‌చ్చే జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ త‌ర‌పున పోటీ చేసిన కిష‌న్ రెడ్డి(Kishan Reddy)కి ఓటు వేసేలా రెండు పార్టీల మ‌ధ్య ఒప్పందం కుదిరిన‌ట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే దీనికి బీజేపీ స‌హ‌క‌రించింద‌నే చర్చ జోరుగా నడుస్తుంది. న‌వంబ‌ర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌డంతో హాస్టళ్ల అసోసియేషన్ నాయకుడు ఒకరు మళ్లీ రంగంలోకి దిగిన‌ట్టు చ‌ర్చ న‌డుస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు(Gunturu), విజయవాడ(Vijayavada) ప్రాంతాల నుంచి వేల‌ మందిని జూబ్లీహిల్స్‌కు తీసుకొచ్చి ఓటర్లుగా నమోదు చేయడానికి ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇక ఇటీవ‌ల ఒకే ఇంటి నెంబ‌ర్ మీద గుర్తించిన 43 ఓట్లు కూడా 2023కు ముందు బీఆర్ఎస్ హ‌యాంలోనే న‌మోదు చేశారన్న విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

Also Read; Prisioner Death: రిమాండ్ ఖైదీ ఆత్మహత్య.. జైలులో ఏం చేసుకున్నాడో తెలుసా?

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ?

గ‌త జీహెచ్‌ఎంసీ(GHMC) ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ నాయకులు బూటకపు ఓటర్లను సృష్టించారనే ఆరోప‌ణ‌లున్నాయి. శ్రీనగర్ కాలనీలో ఓటర్ల జాబితా రాత్రికి రాత్రే 15 శాతం పెరిగిందని, దీనికి హాస్టళ్లు, పీజీల కేంద్రంగా బీఆర్ఎస్ సృష్టించిన‌ ఫేక్ ఓట‌ర్లు కార‌ణ‌మ‌ని ఆ పార్టీ బూత్ క‌మిటీ స‌భ్యులు ఇటీవ‌ల నోరుజారారు. బీఆర్ఎస్ నాయకులు హాస్టల్స్, పీజీల్లో ఉన్నవారికి డ‌బ్బులు ఇచ్చి ఓట‌ర్లుగా న‌మోదు చేయించార‌ని ప‌లువురు సామాజిక కార్యక‌ర్తలు అప్పట్లోనే ఆరోపించారు. 2023లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా వెంగ‌ళ‌రావు నగర్‌లో 3 వేల నుంచి 4 వేల నకిలీ ఓటర్లను నమోదు చేశారని, దీని వెనుక ఆ హాస్టల్స్ అసోసియేషన్ బృందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నకిలీ ఆధార్(Adhar), స్థానిక‌త‌ను ధ్రువీక‌రించే ఇత‌ర న‌కిలీ పత్రాలతో ఫేక్‌ ఓటర్లను నమోదు చేశారని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌లో ఓట‌మి త‌ప్పద‌ని ఓ అంచ‌నాకు వ‌చ్చేసిన బీఆర్ఎస్ మ‌ళ్లీ న‌కిలీ ఓట‌ర్ల న‌మోదుకు తెర‌లేపిన‌ట్టు ప్రచారం జ‌రుగుతున్నది.

అడ్డంగా బుక్కైన కేటీఆర్‌…

అధికార కాంగ్రెస్(Congress) ప్రభుత్వం మీద‌ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సాగిస్తున్న విష‌ ప్రచారం మరోసారి బట్టబయలైంది. ప్రతి సందర్భంలో ఆయన‌ ప్రభుత్వాన్ని నిందిస్తూ తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నట్టు రుజువైంది. తాజాగా జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్‌ న‌కిలీ ఓట‌ర్లను న‌మోదు చేస్తోందంటూ ఆయ‌న చేస్తున్న దుష్ప్రచారం త‌ప్పని నిరూపిత‌మైంది. ఓట‌ర్ల న‌మోదు ప్రక్రియ‌లో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌లేద‌ని ఈసీ స్పష్టం చేసింది. ఇటీవ‌ల జూబ్లీహిల్స్‌లోని ఒకే ఇంట్లో 43 మంది న‌కిలీ ఓట‌ర్లను న‌మోదు చేశారనే త‌ప్పుడు ప్రచారానికి కేటీఆర్ తెర‌లేపారు. త‌ద్వారా కాంగ్రెస్ ఓట్ చోరీకి పాల్పడుతోందంటూ విష‌ప్రచారాన్ని ప్రారంభించారు. దీనిపై విచార‌ణ జ‌ర‌ప‌గా కేటీఆర్(KTR) ఆరోప‌ణ‌ల్లో వాస్తవం లేద‌ని ఈసీ తేల్చిచెప్పింది. హౌస్ నెంబ‌ర్‌ 8-3-231/బి/118లో 50 మంది, హౌస్ నెంబ‌ర్‌ 8-3-231/బి/160లో ఉన్న 43 మంది ఓట‌ర్ల పేర్లు ముందు నుంచి జాబితాలో ఉన్నవే అని స్పష్టం చేసింది. అంతేకాకుండా 2023లోనే వీరంద‌రూ ఓట‌ర్లుగా న‌మోదైన‌ట్టు వెల్లడించింది. అంటే, బీఆర్ఎస్ హ‌యాంలోనే వీరందరూ ఓట‌ర్ల జాబితాలో పేరు న‌మోదు చేసుకున్నట్టు స్పష్టమ‌వ్వడంతో కేటీఆర్ చేస్తున్న త‌ప్పుడు ప్రచారానికి తెర‌ప‌డింది.

Also Read; Minister Vivek: నాకు మంత్రి పదవి పై మోజు లేదు.. మంత్రి వివేక్ వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటి?

కేటీఆర్ రోజుకొక విష ప్రచారం

ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం మీద రోజుకొక విష ప్రచారం చేస్తున్న కేటీఆర్(KTR) ప్రతి సంద‌ర్భంలోనూ అడ్డంగా దొరికిపోతున్నారు. ప‌లు అంశాల‌పై ఆయ‌న కాంగ్రెస్ ప్రభుత్వం మీద త‌ప్పుడు ప్రచారం చేసిన ప్రతిసారీ అబాసుపాల‌వుతున్నారు. గ‌తంలో ఫాక్స్‌కాన్ సంస్థను బెంగ‌ళూరుకు త‌ర‌లించుకుపోయేందుకు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్(DK Shiva Kumar) ప్రయ‌త్నిస్తున్నారంటూ ఓ లేఖ చూపిస్తూ త‌ప్పుడు ప్రచారం చేశారు. తీరా అది న‌కిలీ లేఖ అని తేల‌డంతో కేటీఆర్ త‌ప్పుఒప్పుకున్న ప‌రిస్థితి. లేఖ‌ను బహిర్గతం చేసే ముందు తాను రుజువు చేసుకోలేదని చెప్పి తప్పించుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. అయితే, అది 2018 బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో జ‌రిగిన ఘ‌ట‌న అని తెలుసుకొని పోస్టును డిలీట్ చేయాల్సి వ‌చ్చింది. ఇటీవ‌ల గ్రూప్‌-1 పోస్టుల‌ను రూ.3 కోట్ల‌కు అమ్ముకున్నార‌నే త‌ప్పుడు ప్ర‌చారానికి తెర‌లేపారు. అయితే, ఈ ప‌రీక్షల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌నేందుకు ఎలాంటి ఆధారాలు లేవ‌ని హైకోర్టు స్పష్టం చేసింది. ఇన్ని ర‌కాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న కేటీఆర్ ప్రతి సంద‌ర్భంలోనూ అడ్డంగా దొరికిపోతున్నారు. త‌ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై తాను చేసే ఆరోప‌ణ‌ల‌కు, విష‌ప్ర‌చారానికి ఆధారాలు ఉండ‌వు అనే విష‌యాన్ని కేటీఆర్ మ‌రోసారి నిరూపించుకున్నార‌ని కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

కొత్తగా ఎవరి పేర్లు యాడ్ చేయలేదు: జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ క్లారిటీ

ఫేక్ ఓటర్ల ప్రచారంపై హైదరాబాద్(Hyderabad జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ కర్ణన్(Karnana) క్లారిటీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇంటి నెంబర్ 8-3-231/బి/160 ఇంటి నెంబర్ పై 43 మంది ఓటర్లు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ఒకే నెంబర్‌పై ఎక్కువగా ఓటర్లు ఉన్న దానిపై కూడా విచారణ చేయించినట్లు ఆయన వెల్లడించారు. యూసుఫ్‌గూడ డివిజన్‌ కృష్ణా నగర్‌ బీ-బ్లాక్‌లో బూత్‌ నెంబర్‌ 246 లోని ఓటరు జాబితా ప్రకారం 8-3-231/బి/160 నెంబర్‌తో సంస్కృతి అవెన్యూ అనే అపార్ట్‌మెంట్ ఉన్నాయని, ఇందులో 15 ఫ్లాట్లు ఉండగా 15 కుటుంబాలు నివసిస్తున్నాయని, ఈ ఓట్లు ఆ15 ఫ్లాట్లకు చెందిన విగా గుర్తించినట్లు వెల్లడించారు. అలాగే 8-3-231/బి/118 నెంబర్‌తో 50 మంది ఓటర్లు, 8-3-231/ బి/ 119 నెంబర్‌తో 10 మంది ఓటర్లు, 8-3-231/బి/164 అనే ఇంటి నెంబర్‌తో 8 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. కాగ, ఈ ఓట్లన్నీ కూడా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఓటర్లుగా కొసాగుతున్న వారేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఓటర్లంతా 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 పార్లమెంటు ఎన్నికల్లోనూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని క్లారిటీ ఇచ్చారు. తాము కొత్తగా ఎవరి పేర్లనూ యాడ్ చేయలేదని స్పష్టం చేయడంతో పాటు ఈ ఆరోపణలను ఆయన ట్విటర్ వేదికగా ఖండించారు.

Also Read: Economics Nobel: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్.. వారు చేసిన అద్భుత కృషి ఏంటంటే?

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..