Minister-Vivek
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Minister Vivek: నాకు మంత్రి పదవి పై మోజు లేదు.. మంత్రి వివేక్ వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటి?

Minister Vivek:

నిజామాబాద్: మాలల ఐక్య సదస్సులో మంత్రి వివేక్ (Minister Vivek) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేశారని, మంత్రిగా తాను ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కులం ఆధారంగా కొందరు కుట్రలు, విమర్శలు చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ‘‘ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ని రెచ్చగొట్టి విమర్శలు చేయించారు. జూబ్లీహిల్స్‌లో పార్టీ గెలిస్తే నాకు మంచిపేరు వస్తుందనే విమర్శలు చేస్తున్నారు. లక్ష్మణ్ నాపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడంలేదు. లక్ష్మణ్ వచ్చినపుడు నేను వెళ్లిపోతున్నానని అనటం అసత్యం. నేను మాల జాతి అని మంత్రి లక్ష్మణ్ విమర్శలు చేస్తున్నారు. నాకు మంత్రి పదవిపై మోజు లేదు. లక్ష్మణ్‌ను రాజకీయంగా ప్రోత్సహించింది ‘కాకా’ అని మర్చిపోతున్నాడు. నా మీద ఎందుకు ఇంత ఈర్ష్య. నేను అందరితో కలిసి కట్టుగా ఉంటాను’’ అని మంత్రి వివేక్ అన్నారు. అయితే, మంత్రి వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.

Read Also- Maoist Posters: వడ్డీ వ్యాపారులారా ఖబర్దార్?.. భద్రాచలంలో మావోల పోస్టర్లు కలకలం

నన్ను ఎవరూ ఏమీ అనలేదు: మంత్రి కొండా సురేఖ
2 రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు రాలేదు
పార్టీ లైన్ దాటను.. అసత్య ప్రచారాలు తగదు..

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తనను పార్టీలో ఎవరూ ఏమీ అనలేదని మంత్రి కొండా సురేఖ ఆదివారం క్లారిటీ ఇచ్చారు. రెండు రోజుల నుంచి తాను ఇంట్లోనే ఉన్నానని, అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఆమె సూచించారు. పార్టీ లైన్ దాటి తాను ఎలాంటి నిర్ణయం తీసుకోబోనని కొండా సురేఖ నొక్కిచెప్పారు. తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అధిష్టానం క్లాస్ పీకిందని ప్రచారం చేయడం సరికాదన్నారు. జరగని విషయాలను కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కొన్ని సోషల్ మీడియా, మీడియా ప్లాట్ ఫామ్‌లలో తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. కాగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య మేడారం జాతర కాంట్రాక్టుల విషయంలో విభేదాలు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. ప్రజల కోసం తాను నిరంతరం పనిచేసే వ్యక్తినంటూ వివరించారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, ప్రజల కష్టాలు, సమస్యల పరిష్​కారంపై మాత్రమే తన ఫోకస్ ఉంటుందని కొండా సురేఖ వెల్లడించారు.

Just In

01

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ మరొక్క రోజు వెనక్కి!.. ఎందుకంటే?

Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్!

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు