Donald Trump: ఈ ఏడాది జనవరిలో అధికారం చేపట్టిన నాటి నుంచి సుంకాల పాట పాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన వైఖరిని సమర్థించుకుంటూ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టారీఫ్‌ల విధానాన్ని వ్యతిరేకించేవాళ్లు ‘మూర్ఖులు’ అని ఆయన అభివర్ణించారు. సుంకాలు అమెరికాను బలోపేతం చేశాయని, సుసంపన్నం చేశాయంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం (నవంబర్ 9) ‘ట్రూత్ సోషల్’ వేదికగా పోస్టులు పెట్టారు. ‘‘సుంకాల వ్యతిరేకులు మూర్ఖులు. నా నాయకత్వంలో దాదాపు జీవో ద్రవ్యోల్బణంతో, స్టాక్ మార్కెట్‌లో రికార్డ్ స్థాయి ధరలతో యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనికమైన, అత్యంత గౌరవప్రదమైన దేశంగా అవతరించింది’’ అని ఆయన పేర్కొన్నారు. సుంకాల రూపంలో దేశం ట్రిలియన్ల డాలర్ల మేర ఆర్జిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. టారీఫ్ విధానం త్వరలోనే పేరుకుపోయిన 37 ట్రిలియన్ డాలర్ల అప్పును తగ్గించడం ప్రారంభిస్తుందని ఆయన పేర్కొన్నారు. తన హయాంలో అమెరికాలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తరలి వస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్లాంట్లు, ఫ్యాక్టరీలు ఏర్పాటు అవుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
Read Also- Bigg Boss Telugu 9: ట్రోఫీకి, ఎగ్జిట్‌కి దగ్గరగా ఉందెవరంటే? మళ్లీ తనూజ చేతుల్లోనే ఎలిమినేషన్!
కాగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు మేలు చేకూర్చే వాణిజ్య విధానాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు సుంకాలను ప్రధాన ఆయుధంగా మార్చుకున్నారు. ప్రపంచంలో ఏ దేశాధ్యక్షుడూ వ్యవహరించనంత కఠిన వైఖరిని కొనసాగిస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో ఏకపక్ష వాణిజ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ట్రంప్ దృష్టిలో, సుంకాలు కేవలం పన్నులు కాదు, ఆర్థిక ఆయుధాలుగా ఆయన వాడుకుంటున్నారు. భారత్, చైనా, యూరప్‌లతో పాటు అనేక దేశాల ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
Read also- Singareni Collieries: భవిష్యత్తులో కీలక ఖనిజాల తవ్వకాలు ఉంటే భాగస్వాములవుతాం
