Sunita Williams (image credit:Twitter)
అంతర్జాతీయం

Sunita Williams: సునీతా విలియమ్స్.. విజయం వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు?

Sunita Williams: సునీతా విలియమ్స్.. ఇప్పుడు ఎవరి నోట విన్నా.. ఆమె పేరే. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ 9 నెలలు అంతరిక్షంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే సునీతా విలియమ్స్ ను వెనక్కు తీసుకువచ్చేందుకు నాసా క్రూ-10 మిషన్‌ ను ప్రయోగించింది.

ఆ ప్రయోగం విజయవంతంగా పూర్తై, సునీతా సురక్షితంగా భూమి మీదికి రావాలని ప్రపంచం మొత్తం ఆకాంక్షిస్తోంది. ప్రధానంగా భారతీయులు పూజలు నిర్వహిస్తూ, సునీతా విలియమ్స్ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ అంటే తెలియని వారుండరు. ప్రపంచంలోని వ్యోమగాములలో సునీతా ఒకరు. ప్రస్తుతం అందరూ సునీతా గురించే చర్చించుకుంటున్నారు. కానీ ఆమె విజయాల వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రతి ఒక్కరి విజయం వెనుక ఎవరో ఒకరు తప్పక ఉంటారు. సాధారణంగా పిల్లల విజయాల వెనుక వారి తల్లిదండ్రులు ఉంటారు. అలాగే సునీతా విలియమ్స్ పేరు ప్రపంచం మొత్తం మార్మోగడానికి ప్రధాన కారకులు ఆమె తండ్రి దీపక్ పాండ్య. ఈయన గురించి తెలుసుకుంటే కళ్లు చెమ్మగిల్లాల్సిందే.

దీపక్ పాండ్య మన దేశానికి చెందిన వారు కావడం మనకు గర్వకారణం. గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని ఝులసన్‌లో దీపక్ పాండ్య జన్మించారు. ఈయన ఒక అనాథగా జన్మించారని పలు కథనాలు వెలువడ్డాయి. ఒక అనాథగా తన జీవితాన్ని ప్రారంభించిన దీపక్ పాండ్య ప్రాథమిక విద్యతో పాటు డిగ్రీ కూడా గుజరాత్ లోనే పూర్తి చేశారు.

ఒక అనాథగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ తన లక్ష్యం వైపు దీపక్ పయనించి విజయాన్ని అందుకున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం అమెరికాకు వెళ్లి ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో మెడిసిన్‌లో ఇంటర్న్‌షిప్ మరియు రెసిడెన్సీ శిక్షణ పొంది ప్రముఖ న్యూరోఅనాటమిస్ట్ గా పేరుగాంచారు.

అనాథగా జీవితాన్ని ప్రారంభించి తన లైఫ్ లో సక్సెస్ సాధించారు. అయితే బోనీ జలోకర్ అనే స్లోవేకియా దేశస్తురాలిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా, వీరిలో సునీతా విలియమ్స్ ఒకరు. తన కుమార్తె ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో నావికా దళంలో ఉండాలన్నదే దీపక్ పాండ్య కోరిక.

ఆ కోరికకు తగినట్లుగానే సునీతా విలియమ్స్, నాన్న చూపిన బాటలో నడిచారు. ఎట్టకేలకు ముందు ఏవియేటర్ శిక్షణ, ఆ తర్వాత యుద్ద హెలికాప్టర్ శిక్షణ పొంది ఆ తర్వాత వ్యోమగామిగా గుర్తింపు పొందారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ మహిళా సునీతా విలియమ్స్ రికార్డ్ నెలకొల్పారు. అయితే ఆమె తండ్రి దీపక్ పాండ్య 2020 లో కన్నుమూశారు. తండ్రి కోరికను నెరవేర్చిన కుమార్తెగా సునీతా విలియమ్స్ ను చెప్పవచ్చు.

ప్రస్తుతం సునీతా విలియమ్స్ అంతరిక్షం నుండి వచ్చే సమయం ఆసన్నమైంది. జూన్ 5, 2024 లో మరో వ్యోమగామి బారీ విల్మోర్ తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లిన ఈమె, జూన్ 14 నే భూమి మీదికి రావాల్సి ఉంది. కానీ వారు వెళ్లిన వ్యోమనౌకలో హీలియం లీకేజి కారణంగా టెక్నికల్ సమస్యలు రాగా 9 నెలలు అక్కడే ఉండిపోయారు. నాసా ఎట్టకేలకు క్రూ-10 మిషన్‌ ను ప్రయోగించి సునీతా విలియమ్స్ ను భూమి మీదికి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది.

Also Read: Hyderabad Rental Scam: హైదరాబాద్ లో కోలివింగ్ పేరిట దోచుడే దోచుడు.. అమాయక యువతులే టార్గెట్?

మరికొన్ని గంటల్లో విలియమ్స్ భూమి మీదికి రానున్నారు. మొత్తం మీద సునీతా విలియమ్స్ ప్రపంచం గర్వించదగ్గ వ్యోమగామిగా గుర్తింపు పొందేందుకు, ఆమె విజయం వెనుక ఎవరున్నారు అంటే నాన్న. అంతేకదా మరి ఏ బిడ్డ విజయం వెనుకైనా తప్పక నాన్న ఉంటారన్నది ఎవరూ కాదనలేని విషయం. భారతదేశం ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన సునీతా విలియమ్స్ తో పాటు ఆమె తండ్రి దీపక్ పాండ్యా కు సెల్యూట్ చేద్దాం.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు