Sunita Williams (image credit:AI)
అంతర్జాతీయం

Sunita Williams: సునీతా విలియమ్స్.. అంతరిక్ష నిద్ర ఎన్ని గంటలో తెలుసా?

Sunita Williams: అంతరిక్షం.. ఇక్కడి వాతావరణం తట్టుకోవడం అంత ఈజీ కాదు. అందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. కానీ వ్యోమగాములు మాత్రం అంతరిక్షంలోకి వెళ్లి చేసిన ప్రయోగాలు కోకొల్లలు. అయితే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే. భూమి మీద మనం నిద్రపోతాం.. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు ఎలా నిద్రపోతారన్నది పెద్ద ప్రశ్న. అందులోనూ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో ఏకంగా 9 నెలలు ఉండి పోయారు.

అక్కడ ఆమె నిద్ర సంగతి ఏమిటన్నది అంతుచిక్కని ప్రశ్నగా పలువురు తెలుపుతున్నారు. సునీతా విలియమ్స్ సుమారు 270 రోజులు అంతరిక్షంలో నిద్రను త్యాగం చేశారని కొందరు, లేదు లేదు అంతరిక్షంలో ఉంటే నిద్రకు దూరమే అంటూ మరికొందరు తమతమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. ఇంతకు అసలు వాస్తవం ఏమిటో తెలుసుకుందాం.

సాధారణంగా ప్రతి మనిషికి నిద్ర అవసరం. నిద్ర లేకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు. అందుకే వైద్యులు కూడా ప్రతి మనిషి రోజుకు 6 నుండి 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తుంటారు. అయితే అంతరిక్షంకు వెళ్లిన వ్యోమగాములు మానవులే.. వారికి కూడా నిద్ర అవసరం. సరైన నిద్ర లేకుంటే వారికి అనారోగ్య సమస్యలు పలకరిస్తాయి. భూమి మీద ఉండే మనం ఒక్కరోజు నిద్రను త్యాగం చేస్తే, మన కళ్లు ఎర్రబడడం, శరీరం ఏ పనికి సహకరించని పరిస్థితిని ఎదుర్కొంటాం. అందుకే మనకు నిద్ర తప్పనిసరి.

భూమి మీద ఉండే మనకే నిద్ర తప్పనిసరి అయితే వ్యోమగాములకు కూడా నిద్ర సమయం తప్పక ఉంటుంది. ఎందుకంటే వ్యోమగాములకు ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సునీతా విలియమ్స్ 9 నెలల అంతరిక్ష యాత్రలో ఎన్ని గంటలు నిద్రపోయారన్నది అంతుచిక్కని ప్రశ్న ఏమి కాదు.

ఎందుకంటే నాసా వ్యోమగాములు 24 గంటల కాలంలో 8 గంటలు నిద్ర పోవాలని షెడ్యూల్ ఉంటుంది. అయితే అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేనందువల్ల గాలిలో తేలియాడడం కామన్. అలాంటి పరిస్థితిలో సునీతా విలియమ్స్.. 8 గంటలు ఎలా నిద్రపోయారో తెలుసుకుందాం.

2024, జూన్ 5న మరో వ్యోమగామి బారీ విల్మోర్ తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లారు. 9 రోజుల్లో వెనక్కు రావలసిన ఈ బృందం సాంకేతిక కారణాలతో 9 నెలలు అక్కడే ఉండిపోయారు. ఎన్నో అంతరాయాలను వీరు అంతరిక్షంలోకి ఎదుర్కొనే ఉంటారు. 9 నెలల కాలంలో అదే మనం ఉండాల్సి వస్తే.. ఆ ఊహకు కూడా మనం దూరంగా ఉంటాం.

ఇక సునీతా విలియమ్స్ నిద్ర విషయంలోకి వెళితే.. ప్రతి వ్యోమగామికి ఒక చిన్న స్లీపింగ్ పాడ్ ఉంటుంది. దానితో గోడకు స్లీపింగ్ బ్యాగ్ జత చేయబడుతుంది. ఈ పాడ్‌లలో వెంటిలేషన్ ఫ్యాన్‌లు అమర్చబడి ఉంటాయి. ఇవి గాలి ప్రవాహాన్ని నిర్ధారించడానికి, నిద్రపోతున్నప్పుడు కార్బన్ డయాక్సైడ్ పేరుకు పోకుండా ఉండేందుకు దోహద పడతాయి.

ఇక్కడే మనకు ఒక డౌట్ రావచ్చు. అంతరిక్షంలో గాలిలో తేలుతూ ఉంటారు.. మరి నిద్ర ఎలా అని.. అందుకు సమాధానమే స్లీపింగ్ బ్యాగ్స్. వ్యోమగాములు తమ స్లీపింగ్ బ్యాగ్‌ల లోపలికి వెళ్లి నిలువుగా, అడ్డంగా ఎలాగైనా నిద్రపోవచ్చు.

వీరు నిద్రపోతున్నప్పుడు మళ్లీ గాలిలోకి వెళ్ళకుండా, స్లీపింగ్ బ్యాగ్‌లను అక్కడే కట్టివేస్తారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. అంతరిక్షంలో రోజుకు 16 సూర్యోదయాలను, సూర్యాస్తమయాలను వ్యోమగాములు ఎదుర్కొంటారు. దీనితో వారి శరీరం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Also Read: Sunita Williams: సునీతా విలియమ్స్.. విజయం వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు?

అందుకే వ్యోమగాములు స్లీప్ మాస్కులు ధరించి నిద్రలోకి జారుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సునీతా విలియమ్స్ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో ఆమె 9 నెలలు హాయిగా నిద్ర పోయి ఉంటారని భావించవచ్చు. దీనిని బట్టి సుమారు 270 రోజులు అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్ రోజులు 8 గంటలు నిద్రకు ఉపక్రమిస్తే, 2160 గంటలు నిద్రపోయినట్లుగా మనం లెక్క వేయవచ్చు.

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..