Sunita Williams (image credit:AI/Twitter)
అంతర్జాతీయం

Sunita Williams: సునీతా విలియమ్స్ సేఫ్.. ఇదే లేకుంటే.. ఎప్పటికీ అక్కడే?

Sunita Williams: హమ్మయ్య.. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ దివి నుండి భూమికి 9 నెలల అనంతరం సురక్షితంగా చేరుకున్నారు. అలాగే మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ సైతం ఆమెతో పాటు భూమికి క్షేమంగా చేరారు. అయితే వీరు అంతర్జాతీయ స్పేస్ సెంటర్ నుండి క్షేమంగా భూమి మీదికి వచ్చేందుకు తోడ్పడ్డ క్రూ డ్రాగన్ వ్యోమ నౌక గురించి తెలుసుకోవాల్సిందే.

ప్రస్తుతం సునీతా విలియమ్స్, మరో ముగ్గురు వ్యోమగాములు గల క్రూ డ్రాగన్ వ్యోమనౌక తెల్లవారుజామున 3.27 గం.కు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని తగ్గించుకుని సురక్షితంగా దిగింది. వెంటనే నాసా సిబ్బంది చిన్న చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చారు. రికవరీ వెస్సెల్ దాన్ని లిఫ్ట్ చేసిన తర్వాత క్యాప్సుల్ డోర్‌ను ఓపెన్ చేసి సునీతతో పాటు నలుగురు వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు.

ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా, అసలు క్రూ డ్రాగన్ అంటే ఏమిటన్న సందేహం అందరిలో వస్తోంది. ఎక్కడో 400 కిలో మీటర్ల దూరంలో గల అంతరిక్షం నుండి సేఫ్ గా వారిని తీసుకురావడంలో క్రూ డ్రాగన్ సక్సెస్ సాధించింది.

దీనితో క్రూ డ్రాగన్ వ్యోమ నౌక ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. దీని ప్రత్యేకతలు తెలుసుకుంటే ఔరా అనేస్తారు. ఇక ఆ విషయాలలోకి వెళితే.. స్పేస్‌ఎక్స్ అభివృద్ధి చేసిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, గమ్యస్థానాలకు రవాణా చేయడానికి రూపొందించబడిన అత్యాధునిక అంతరిక్ష నౌక. అత్యంత అధునాతనమైన ప్రత్యేకతలను ఇది కలిగి ఉంది. క్రూ డ్రాగన్ పూర్తిగా స్వయం ప్రతిపత్తి డాకింగ్, అన్‌డాకింగ్ నావిగేషన్ చేయగలదు. అయితే అవసరమైతే విమానంలో ఉన్న వ్యోమగాములు మాన్యువల్ నియంత్రణ కూడా చేయవచ్చు.

క్రూ అత్యవసర అబార్ట్ వ్యవస్థను కలిగి ఉంటుంది. క్యాప్సూల్ లోపలి భాగం ఆధునికమైనది.. టచ్-స్క్రీన్ నియంత్రణలు, ఎర్గోనామిక్ సీట్లు.. వ్యోమగామి సౌకర్యం కోసం మెరుగైన లైఫ్-సపోర్ట్ సిస్టమ్‌లను కలిగి ఉంటుంది. క్రూ డ్రాగన్ ఏడుగురు వ్యోమగాములను తీసుకెళ్లగలదు. అయితే నాసా సాధారణంగా నలుగురు సిబ్బంది సభ్యులకు దీనిని ఉపయోగిసస్తారు.

క్యాప్సూల్ ఉష్ణోగ్రత, ఆక్సిజన్, నియంత్రిత వాతావరణాన్ని అందిస్తుంది. దీనితో లోపలి వ్యోమగామికి ఏ కష్టం రాదు.. ఏ శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తవు.
క్రూ డ్రాగన్ సముద్రంలో పారాచూట్ సహాయంతో స్ప్లాష్‌డౌన్ ద్వారా భూమికి తిరిగి వస్తుంది. క్రూ డ్రాగన్ యొక్క ఏరోడైనమిక్ ఆకారం ప్రయోగం, డాకింగ్, పునఃప్రవేశ సమయంలో పనితీరును ఆప్టిమైజ్ చేస్తుంది.

సాంప్రదాయ స్విచ్‌లు, డయల్‌లకు బదులుగా, క్రూ డ్రాగన్ అధునాతన టచ్‌స్క్రీన్ నియంత్రణలను కలిగి ఉంటుంది. PICA-X వంటి అధునాతన పదార్థాలతో నిర్మించబడిన హీట్ షీల్డ్, తీవ్రమైన ఉష్ణోగ్రతల నుండి 3,500°F లేదా 1,900°C వరకు క్యాప్సూల్‌ను రక్షిస్తుంది.

Also Read: Sunita Williams: చిరునవ్వు చెరగలేదు.. ధైర్యం వీడలేదు.. ఎట్టకేలకు భువిపైకి సునీతా విలియమ్స్..

క్రూ డ్రాగన్ ఆన్‌బోర్డ్ అత్యవసర వైద్య సామాగ్రిని కలిగి ఉంటుంది. ఊహించని పరిస్థితులలో వ్యోమగాములు దీనిని ఉపయోగిస్తారు. ఇన్ని ప్రత్యేకతలు గల క్రూ డ్రాగన్ వ్యోమ నౌకలో సునీతా విలియమ్స్ తో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా భూమి మీదికి చేరుకోగలిగారు. ఏదిఏమైనా క్రూ డ్రాగన్ ద్వారా వీరు భూమి మీదికి క్షేమంగా రావడంతో ప్రపంచమంతా జయజయ ధ్వనులు పలుకుతోంది.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు