Iran Israel Conflict (Image Source: Twitter)
అంతర్జాతీయం

Iran Israel Conflict: ఇరాన్‌పై భీకర దాడులు.. కీలక అణు స్థావరాలు ధ్వంసం.. ఆధారాలివే!

Iran Israel Conflict: ఇరాన్ లోని అణు కేంద్రాలు (Iran Nuclear Plants), సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వరుస దాడులకు తెగబడుతోంది. మరోవైపు ఇరాన్ సైతం దీటుగా ప్రతిఘటిస్తోంది. ఇజ్రాయెల్ పై ఎదురు దాడికి దిగుతోంది. ప్రస్తుత పరిణామాల వరకు చూస్తే యుద్ధంలో ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ దేశం జరిపిన క్షిపణి దాడుల్లో ఇరాన్ లోని కీలక అణుస్థావరాలు ధ్వంసమయ్యాయని అంతర్జాతీయ మీడియా (International Media) పేర్కొంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో బయటకొచ్చి ఉపగ్రహ చిత్రాలు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. ఇరాన్ లోని అణు స్థావరాలు ఏ స్థాయిలో ధ్వంసమయ్యాయో ఆ ఫొటోలను బట్టి స్పష్టం అర్థమవుతోంది.

దెబ్బతిన్న నాటాంజ్ అణు కేంద్రం..
ఇరాన్ లోని అతిముఖ్యమైన అణు కేంద్రాల్లో నటాంజ్ (Natanz) ఒకటి. బాలిస్టిక్ క్షిపణి తయారీకి సంబంధించి ఈ అణు కేంద్రం ఎంతో కీలకంగా వ్యహరిస్తోంది. అయితే జూన్ 13న నటాంజ్ అణు కేంద్రంపై.. పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ క్షిపణి దాడి జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా విడుదలైన శాటిలైట్ ఫొటోలు గమనిస్తే.. నటాంజ్ అణు కేంద్రానికి భారీ మెుత్తంలోనే నష్టం జరిగినట్లు అర్ధమవుతోంది. అయితే ఎంత నష్టం జరిగిందన్న దానిపై అధికారిక లెక్కలు లేనప్పటికీ.. అణు కేంద్రంలో విద్యుత్ సరఫరా, అత్యవసర బ్యాకప్ వ్యవస్థలు, ఇతర కీలక సదుపాయాలు దెబ్బతిన్నట్లు మాత్రం వార్తలు వచ్చాయి.

ఇస్ఫహాన్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్
ఇరాన్ లోని మరో కీలకమైన అణు కేంద్రం ఇస్ఫహాన్ న్యూక్లియల్ సెంటర్ ఒకటి. దీనిని 1984లో చైనా సహకారంలో ఇరాన్ నిర్మించింది. ఇస్ఫహాన్ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న ఈ న్యూక్లియర్ సెంటర్ లో దాదాపు 3000 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. అయితే గత శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల్లో ఇది కూడా దెబ్బతిన్నట్లు.. ఉపగ్రహ చిత్రాల ద్వారా అర్థమవుతోంది. ఈ కేంద్రంలోని రసాయన ప్రయోగశాల, యురేనియం మార్పిడి కర్మాగారం, నాలుగు భవనాలు దెబ్బతిన్నట్లు కథనాలు వచ్చాయి.

ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్
ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వత సానువుల్లో ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ (Fordow nuclear Plant) ఉంది. 1,000 కంటే ఎక్కువ అధునాతన సెంట్రిఫ్యూజ్‌లను ఈ ప్లాంట్ లో ఉన్నాయి. అంతేకాదు యురేనియంను 60% వరకు శుద్ది చేయగల IR-6లు ఈ ప్లాంట్ లోనే ఉన్నాయి. ఉపరితలం నుంచి 200 అడుగుల లోతులో ఈ ప్లాంట్ ను ఇరాన్ నిర్మించింది. వైమానిక బాంబులను సైతం ఇది తట్టుకోగలదు. అయితే తాజాగా విడుదలైన శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే ఈ ప్లాంట్ ఉన్న ఉపరితల ప్రాంతం.. దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. కానీ న్యూక్లియర్ ప్లాంట్ కు నష్టం కలిగినట్లు మాత్రం ఎక్కడా వార్తలు రాలేదు. ఈ ప్లాంట్ ను నాశనం చేసేందుకే ఇజ్రాయెల్.. అమెరికా సాయాన్ని కోరుతోంది.

Also Read: Rowdy Sheeter Arrest: ఓరి నీ తెలివి తగలెయ్య.. ఎలా వస్తాయ్‌రా ఈ ఐడియాలు.. ఇక నీకుందిలే!

పిరాన్ షహర్ వైమానిక స్థావరం
ఇరాన్ – ఇరాక్ దేశాల సరిహద్దుల్లో ఈ పిరాన్ షహర్ వైమానిక స్థావరం ఉంది. దీనిని ఇజ్రాయెల్ పూర్తిగా నాశనం చేసినట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది. అలాగే ఇరాన్ లోని తబ్రిజ్ కు ఉత్తరాన ఉన్న క్షిపణి స్థావరంలో కూడా నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్‌లోని పార్చిన్‌కు ఉత్తరాన 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోజిర్ మిలిటరీ బేస్ తీవ్రంగా దెబ్బతింది. ఈ కాంప్లెక్స్‌లో కొన్ని భవనాలు ధ్వంసమైనట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది. వీటితో పాటూ ఇంకా అనేక ప్రాంతాల్లో తీవ్రంగా నష్టం సంభవించినట్లు తెలిసింది.

Also Read This: Lion Viral Video: ఇదేం సింహంరా బాబూ.. మాంసం కోసం షాపింగే చేసింది.. వీడియో వైరల్!

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?