luxury-car
అంతర్జాతీయం

Funny Incident: భార్యకు నచ్చలేదని… ఖరీదైన కారును చెత్త కుప్పలో విసిరేశాడు

Funny incident: బిజినెస్ సినిమా గుర్తుందా… హీరో మహేశ్ బాబు.. హీరోయిన్ కోసం రూ. 2 కోట్ల విలువైన కారును (Luxury car) గిఫ్ట్ గా ఇస్తాడు. ఇంప్రెస్ అయిపోయిన హీరోయిన్ ‘ఐలవ్యూ’ చెప్తుంది. కానీ హీరో మాటలకు హర్ట్ అయిన కథానాయిక… కారు నాకొద్దు అంటుంది. బయట కూడా ఇలాంటి సీనే జరిగింది. కానీ ప్రేమికుల మధ్య కాదు భార్యభర్తల మధ్య. జరిగింది ఇక్కడ కాదు.. రష్యాలో.

వివరాల్లోకి వెళ్తే… రష్యా రాజధాని మాస్కో సమీపంలో ఉండే మైటిష్చ్ అనే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య కోసం ఖరీదైన కారు(ఎస్ యూవీ) కొన్నాడు. దాని విలువ దాదాపు రూ. 27 లక్షలు. అటుపోట్లు ఎదుర్కొంటున్న వారి వైవాహిక జీవితాన్ని సరిదిద్దుకునేందుకు తద్వారా తన భార్యతో వచ్చే తగాదాలను పరిష్కరించుకునేందుకు ఈ ఐడియా వేశాడు. ప్రేమికుల రోజు నాడు కొత్త కారు గిఫ్ట్ ఇచ్చి తన భార్యను ఇంప్రెస్ చేయాలనుకున్నాడు. అయితే, తీరా డెలీవరి అయ్యాక… ఆ కారుకు కొన్ని చోట్ల డ్యామేజీ అవ్వడం ఆ సతీమణి గమనించింది. అది కొనుగోలుకు ముందే జరిగిందా, ప్రియమైన భార్య చెంతకు తీసుకొచ్చే ముందు జరిగిందా అనే విషయం తెలియదు కానీ … మొత్తానికి ఆమె ఆ కారు తనకొద్దని తిరస్కరించింది.

దీంతో భర్త కోపం నషాలానికి అంటింది.  కొత్త కారుని చెత్త కుప్పలో విసిరేసి వెళ్లిపోయాడు. ఆశ్చర్యమేమిటంటే రెండు వారాలుగా ఆ కారు ఆ చెత్త కుప్ప దగ్గరే ఉంది. విచిత్రమేమిటంటే… చెత్త కంటెనయిర్ పై ఉన్న ఆ కారుతో అక్కడి వారంతా ఫోటోలు, సెల్పీలు దిగుతున్నారు. దాంతో ఆ ప్రాంతం ఓ చిన్న పాటి టూరిస్ట్ స్పాట్ లా తయారైంది.

Also Read: 

Posani Arrest: పోసానిపై పెట్టిన కేసులివే! కేసు పెట్టిన జోగినేని మణి ఏమన్నారంటే…

 

 

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..