Posani Arrest: సినీ నటుడు పోసాని కృష్ణమురళిని (Posani Krishnamurali) ఏపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి హైదరాబాద్ రాయదుర్గంలో కృష్ణమురళిని అరెస్టు చేసిన పోలీసులు ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అక్కడ ఆయనపై 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) తదితర సెక్షన్ల కింద కేసునమోదు చేశారు. సినీపరిశ్రమపై పోసాని తీవ్ర విమర్శలు చేశారని ఫిర్యాదులు అందిన నేపథ్యలో పోసానిపై ఈ కేసులు నమోదయ్యాయి. పవన్ కళ్యాణ్ పై (pawan kalyan) అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన కుటుంబ సభ్యులకు అసభ్యకర రీతిలో మాట్లాడారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు (Chandrababu), లోకేష్(Lokesh) పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని మరో కేసు నమోదైంది. జోగినేని మణి అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు.
వైసీపీ(YCP) ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం (TDP), జనసేన (Janasena) నాయకులపై పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన తీరు మార్చుకోలేదని టీడీపీ నాయకులు ఆరోపించారు. వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఆయనపై పలువురు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏపీలోని అనేక ప్రాంతాల్లో పోసానిపై కేసులు నమోదయ్యాయి. సీఐడీకి సైతం ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పదికిపైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. గుంటూరు, విజయవాడ, నర్సరావుపేట, అన్నమయ్య, అనంతపురం, బాపట్ల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి తదితర ప్రాంతాల్లో ఫిర్యాదులు వచ్చాయి. కాగా, పోసానిని రైల్వేకోడూరు కోర్టులో ఈ మధ్యాహ్నం హాజరుపరిచే అవకాశం ఉంది.
ఇదిలావుంటే… పోసాని అరెస్టును మాజీ సీెఎం జగన్ (Ys Jagan) ఖండించారు. అలాగే ఆయన భార్యను ఫోన్ లో పరామర్శించి ధైర్యం చెప్పారు. ఏపీలో నిరంకుశ పాలన కొనసాగుతోందని, ప్రజలు దీన్ని గమనిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, పోసాని పై ఫిర్యాదు చేసిన జోగినేని మణి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి అనుచితంగా మాట్లాడినందుకే కేసు పెట్టినట్లు తెలిపారు.