Plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలిన దుర్ఘటనను మరచిపోకముందే, మరో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది. రష్యాలో 49 మందితో ప్రయాణిస్తున్న ఓ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోయింది. చైనా సరిహద్దుకు సమీపంలో ఉండే అమూర్ అనే ప్రాంతంలో ఉన్న టిండా పట్టణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ విషాదకర ఘటనలో విమానంలో ఉన్న అందరూ మృతిచెందినట్లుగా తెలుస్తోంది. 43 మంది చనిపోయినట్టుగా కొన్ని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
విమానం గాల్లో ఉండగానే కంట్రోల్ రూమ్‌తో సంబంధాలు తెగిపోయాయి. తొలుత మిస్సింగ్‌గా ప్రకటించిన అధికారులు, వెంటనే రెస్క్యూ చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే విమానం కూలిన ప్రాంతాన్ని గుర్తించారు. మంటల్లో కాలిపోతున్న విమాన శకలాలను గుర్తించారు. ప్రతికూల వాతావరణం కారణంగా విజిబిలిటీ సరిగా లేకపోవడం, ల్యాండింగ్ సమయంలో పైలట్ చేసిన తప్పిదమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమిక అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also- Mumbai Blasts: ముంబై పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు బిగ్ ట్విస్ట్
ల్యాండింగ్ ప్రయత్నం విఫలం!
కుప్పకూలిన విమానం ఏఎన్-24 మోడల్ అని, సైబీరియాకు చెందిన ఆంగరా ఎయిర్‌లైన్ దీనిని నడుపుతోందని స్థానిక ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడించింది. విమానం టిండా ఎయిర్‌పోర్టులో మొదటి ల్యాండింగ్‌కు ప్రయత్నించి విఫలమైంది. ఆ తర్వాత, రెండో ప్రయత్నం చేస్తున్న సమయంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయని వివరించింది. ఈ దుర్ఘటనపై అమూర్ ప్రాంత గవర్నర్ వాసిలీ ఓర్లోవ్ కూడా స్పందించారు. విమానంలో 43 మంది ప్యాసింజర్లు (ఐదుగురు పిల్లలు), ఆరుగురు సిబ్బంది ఉన్నారని తెలిపారు. విమానం ఆచూకీని గుర్తించేందుకు చర్యలు మొదలుపెట్టి, అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించినట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు. కాగా, విమానంలో మొత్తం ఎంత మంది ప్రయాణించారు, ఎంతమంది చనిపోయారనేదానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా, గతేడాది సెప్టెంబర్‌లో కూడా ఇదే అమూర్ ప్రాంతంలో ముగ్గురితో ప్రయాణించిన రాబిన్సన్ ఆర్66 అనే హెలికాప్టర్ అదృశ్యమైంది. చైనా సరిహద్దులో ఉంటే అమూర్ ప్రాంతం రష్యా రాజధాని మాస్కోకు సుమారుగా 6,600 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది.
Read Also- Vijay Deverakonda: గుడ్ న్యూస్ చెప్పిన విజయ్ దేవరకొండ.. మరో రెండు రోజుల్లో మీ ముందుకు..!
An-24 crash site in Russia's Far East seen from helicopter — social media footage
49 on board, including 5 children and 6 crew — no survivors reported
Malfunction or human error considered as possible causes https://t.co/pLMgFY7kBG pic.twitter.com/rU5VWLOnXH
— RT (@RT_com) July 24, 2025
