Most Expensive Biscuit Worth Rs 15 Lakh Titanic Spillers Bakers Pilot Cracker Found On lifeboat
అంతర్జాతీయం

Costly Biscuit: ఒక్క బిస్కెట్‌ ధర @15 లక్షలు

Most Expensive Biscuit Worth Rs 15 Lakh Titanic Spillers Bakers Pilot Cracker Found On lifeboat: మనలో చాలా మంది ఫ్రెండ్స్ బిస్కెట్ వెయ్యకు అంటుంటారు. బిస్కెట్‌కి అంత డిమాండ్ ఉంది మరి. నిజం చెప్పాలంటే బిస్కెట్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు బిస్కెట్‌ని ఎంతో లైక్ చేస్తారు. ఇక ఈ బిస్కెట్ల విషయానికి వస్తే.. రకరకాల కంపెనీల బిస్కెట్లు మనకు మార్కెట్లో దర్శనమిస్తుంటాయి. ఇక ఈ బిస్కెట్లను చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఆకలేసినప్పుడు పాలతో, టీతో కలిపి తింటుంటారు. అంతేకాకుండా ఎక్కడికైనా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు బ్యాగ్‌లో బిస్కెట్‌ని క్యారీ చేస్తుంటారు. అయితే మనం కొనుగోలు చేసే బిస్కెట్ ప్యాకెట్ ధర ఎంత ఉంటుంది.

మహా అయితే రూ.10 రూ.20 లేదా రూ.50 ఉంటుంది. అంతకంటే ఎక్కువ అంటే రూ.1000 వరకు ఉండే బిస్కెట్లు ఉన్నాయి. కానీ లక్షల్లో ఉండే బిస్కెట్ చూశారా, ఎప్పుడైనా విన్నారా. ఇది ప్రపంచం మొత్తంలోనే అత్యంత ఖరీదైన బిస్కెట్‌. ఏంటీ లక్షల్లో బిస్కెట్ ఉండటమేంటని అవాక్కయ్యారా. ఏంటీ భయ్యా బిస్కెట్‌ వెయ్యకు అని చెప్పి నువ్వు మాకు బిస్కెట్‌ వేస్తున్నావా అనుకుంటున్నారా.. మీరు విన్నది నిజమే. ఓ బిస్కెట్ ధర ఏకంగా రూ. 15 లక్షలు. కేవలం 10 సెం.మీ ఉండే ఈ బిస్కెట్‌కు అన్ని లక్షలు మరి. అంత ఖరీదు ఎందుకు? దానిలోని ప్రత్యేకత ఏంటనేది మనం కూడా తెలుసుకుందాం.

Also Read: జైలుకు దారితీసిన కుక్కలపై ప్రేమ

అసలు మ్యాటర్‌ ఏంటంటే.. టైటానిక్ షిప్ మునిగిపోయిన విషయం మనందరికి తెలిసిందేగా. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రమాదం జరిగిన ప్లేస్‌లో దొరికిన కొన్ని వస్తువులకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఓ నివేదిక ప్రకారం టైటానిక్ మునిగిపోయే కంటే ముందు ఫెన్విక్ అనే వ్యక్తి షిప్ కూడా సముద్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన కంటే ముందే టైటానిక్ షిప్‌ మునిపోకుండా సహాయం చేస్తున్న క్రమంలో అతనికి ఓ బిస్కెట్ దొరికిందట. దానిని అతను గుర్తుగా దాచుకున్నాడని సమాచారం. అయితే 2015లో ఫెన్విక్‌ ఆ బిస్కెట్‌ను వేలం వేశాడు. అది ఏకంగా 15 వేల పౌండ్లకు అమ్ముడు పోయింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఏకంగా రూ. 15 లక్షలు అన్నమాట. ప్రస్తుతం ఈ బిస్కెట్‌కు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిస్కెట్‌గా ఎంతగానో పరిగణించబడిందని తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ఈ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఈ బిస్కెట్‌ గురించి నెటిజన్లు కుప్పలు తెప్పలుగా గూగుల్‌లో సెర్చ్‌ చేయడం స్టార్ట్ చేశారు.

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?