S Jai Shankar
అంతర్జాతీయం

S Jaishankar: లండన్ లో ఉగ్ర కలకలం.. భారత విదేశాంగ మంత్రిపై దాడికి యత్నం

S Jaishankar: భారత విదేశాంగ మంత్రి జై శంకర్ చేపట్టిన లండన్ పర్యటనలో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. ఛాఠమ్ హౌస్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన జై శంకర్ ను ఖలిస్తానీ సానుభూతి పరులు (Khalistani extremists) అడ్డుకునే ప్రయత్నం చేశారు. చాఠమ్ హౌస్ ఎదుట పదుల సంఖ్యలో ఖలిస్థానీ సానుభూతి పరులు నిరసనలకు దిగారు. లోపల భేటి జరుగుతుండగా భారత్ వ్యతిరేక నినాదాలతో చాఠమ్ హౌస్ పరిసరాలను హోరెత్తించారు. ఈ క్రమంలో భేటి ముగించుకొని జై శంకర్ బయటకు రాగా ఓ ఖలిస్తానీ అతివాది దారుణంగా ప్రవర్తించాడు.

జైశంకర్ వైపు దూసుకొచ్చి..

భారత విదేశాంగ మంత్రి జై శంకర్.. మార్చి 4న యూకే పర్యటనకు వెళ్లారు. భారత్ – యూకే ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మార్చి 9వ తేదీ వరకూ అక్కడ పర్యటించనున్నారు. ఈ క్రమంలో తాజాగా లండన్ లోని ఛాఠమ్ హౌస్ లో పలు అధికారిక సమావేశాల్లో పాల్గొన్న జైశంకర్.. అనంతరం బయటకు వచ్చారు. ఆ సమయంలో ఓ ఖలీస్థానీ దుండగుడు విదేశాంగ మంత్రి కారు వద్దకు దూసుకొచ్చాడు. చేతిలో ఉన్న జాతీయ జెండాను చించేస్తూ అవమానకరంగా ప్రవర్తించాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన లండన్ పోలీసులు వెంటనే అతడ్ని అడ్డుకున్నారు. అతడితో పాటు మిగతా అందోళనకారులను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ మారాయి.

అమెరికా ప్రతీకార సుంకాలపై

అంతకుముందు చాఠమ్ హౌస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘ప్రపంచంలో భారతదేశ వృద్ధి.. పాత్ర’ అంశంపై జై శంకర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ పై ట్రంప్ విధిస్తానంటున్న ప్రతీకార సుంకాలపై స్పందించారు. శక్తివంతమైన దేశాలన్నింటికి సమాన అధికారాలు ఉండాలన్న విధానాన్ని ట్రంప్ అవలంభిస్తున్నట్లు జైశంకర్ అన్నారు. ఇది భారత్ ఆలోచన విధానానికి దగ్గరగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్ పర్యటనలో ఉన్న సంగతిని ఈ సందర్భంగా జైశంకర్ గుర్తుచేశారు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందంపై చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు.

Also Read: Ranya Rao: స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా బుక్

పాకిస్తాన్ కు కీలక సూచన

దశాబ్ద కాలంగా భారత్ ను కశ్మీర్ సమస్య వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాఠమ్ హౌస్ ప్రెస్ మీట్ లో జై శంకర్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో కశ్మీర్ వివాదంపై మరోమారు స్పందించిన జైశంకర్.. ఈసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమించుకున్న తమ భూభాగాన్ని అప్పగిస్తేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తేల్చిచెప్పారు. ఇటీవల కశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేశామన్న విదేశాంగ మంత్రి.. అక్కడ ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు సైతం నిర్వహించినట్లు స్పష్టం చేశారు. అటు చైనాతో స్థిర ద్వైపాక్షిక సంబంధాలను కోరుకుంటున్నట్లు జైశంకర్ తెలిపారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?