Ranya Rao: ప్రముఖ కన్నడ హీరోయిన్ రన్యారావు స్మగ్లింగ్ చేస్తూ పట్టపడటం హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసందే. గోల్డ్ అక్రమ రవాణా చేస్తూ.. బెంగళూర్ ఎయిర్‌పోర్ట్‌లో అడ్డంగా బుక్ అయ్యింది. దుబాయ్ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుపడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఆమె దగ్గర నుంచి 14.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి, రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, మరో రూ.2 కోట్లకుపైగా నగదు సీజ్ చేశారు. మొత్తంగా ఈ కేసులో రన్యారావు నుంచి రూ.17.29కోట్ల విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో పలుసార్లు దుబాయ్‌కి వెళ్లి రావడం అధికారులు గుర్తించారు. మొత్తం 15 సార్లు దుబాయ్‌కి వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. గత 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్‌కి వెళ్లి రావడంతో అధికారులు ఈమెపై నిఘా పెట్టారు. ఇక దుబాయ్‌కి వెళ్లిన ప్రతిసారి రకరకాలైన దుస్తువులు ధరించడం గుర్తించారు. దీంతో ఆమెపై నిఘా పెంచి ఫాలో చేయడం స్టార్ట్ చేశారు.
ఇక ఇటీవల దుబాయ్ నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగిన రన్యారావు.. అందరూ ప్రయాణికులా వలే ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ చెకింగ్ చేసుకుంది. ఎలాంటి భయం లేకుండా సాధారణంగా కనిపించింది. అయితే ఎయిర్‌పోర్ట్‌లోని ఓ కానిస్టేబుల్ హెల్ప్‌తో ఎగ్జిట్ మార్గం ద్వారా బయటికి వెళ్ళింది. కాపు కాసి రెడీగా ఉన్న డీఆర్‌ఐ అధికారులు ఆమెను ఆపి తనిఖీలు నిర్వహించారు. దీంతో రన్యారావు నడుముకు ధరించిన బెల్టులో కిలోల కొద్ది బంగారం గుర్తించారు. వెంటనే ఆ బంగారం స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల పట్టుపడిన బంగారంలో ఇదే అతి పెద్దదని వెల్లడించారు. అయితే రన్యారావు పోలీసులు విచారణలో సంచలన విషయాలు వెల్లడించింది. తనను ఈ స్మగ్లింగ్ చేయాలని ఒత్తిడి చేసారని, అంతేగాక బ్లాక్‌మెయిల్ చేశారని అందుకే చేయాల్సి వచ్చిందని పోలీసులకు తెలిపింది. ఇక ఎయిర్‌పోర్ట్‌లో రన్యారావుకు సహకరించిన కానిస్టేబుల్‌ని కూడా పోలీసులు విచారించారు. అతడి స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. ఇక రన్యారావు భర్తను కూడా పోలీసులు విచారించనున్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడనున్నాయి.
Also Read: బిగ్‌బాస్‌పై హీరో ఆదిత్య ఓం సంచలన వ్యాఖ్యలు
మరోవైపు ఈ ఘటనపై డీజీపీ కె రామచంద్రరావు స్పందించారు. రన్యారావుకు రామచంద్రరావు సవతి తండ్రి అని తెలిసింది. తనకు నాలుగు నెలల క్రితమే వివాహం జరిగిందని, అప్పటి నుంచి తాను తమ ఇంటికి రాలేదని వెల్లడించాడు. ఆమె చేసే బిజినెస్‌లతో తనకు సంబంధం లేదని స్పష్టం చేసాడు. తన భర్తతో రన్యారావు ఎలాంటి వ్యాపారాలు చేస్తుందో తనకు తెలియదని వెల్లడించాడు. అయితే ఈ ఘటనతో తాను షాక్‌కు గురయ్యాయని తెలిపాడు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని పేర్కొన్నాడు. అయితే రన్యారావును మార్చి 18 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచనున్నారు. ఇక 2014లో ‘మాణిక్య’ అనే చిత్రం కన్నడ పరిశ్రమకు పరిచయమైంది. ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ జంటగా ఈ మూవీలో నటించింది. ఆ తర్వాత విక్రమ్ ప్రభు సరసన ‘వాఘా’ చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక 2017లో పటాకీ అనే మూవీతో కన్నడలో మళ్లీ అడుగుపెట్టింది. పటాకీ ఆమె చివరి సినిమా. ఆ తర్వాత నుంచి ఒక్క మూవీ కూడా చేయలేదు.