Iran Missile
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

Iran: ఇజ్రాయెల్‌పై అతిపెద్ద క్షిపణి ప్రయోగించిన ఇరాన్

Iran: ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలో (Iran-Israel Conflict) చూస్తుండగా వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. శనివారం రాత్రి ఇరాన్‌లోని మూడు కీలక అణుకేంద్రాలను బీ-2 స్టెల్త్ బాంబర్ విమానాల ద్వారా ధ్వంసం చేయడంతో యుద్ధంలోకి అమెరికా ప్రవేశించింది. జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబులతో అగ్రరాజ్యం ఈ దాడులు చేసింది. అయితే, అమెరికా దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్‌పై ఇరాన్ (Iran – Israel Conflict) విరుచుకుపడింది. క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈక్రమంలో ఇరాన్ తన వద్ద ఉన్న అతిపెద్ద క్షిపణిని ప్రయోగించింది. భారీ పేలోడ్‌ను మోసుకెళ్లగల ఆ భారీ మిసైల్ పేరు ‘ఖోర్రామ్‌షహర్-4’ అని ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ ప్రకటించింది. క్షిపణికి సంబంధించిన ఫైల్ ఫుటేజ్‌ని ప్రసారం చేసింది. ఇజ్రాయెల్‌పై ఆదివారం జరిగిన దాడుల్లో దీనిని ఉపయోగించినట్టు వివరించింది.

Read this article- Star Comedian: స్నానం చేయక చేతికి గజ్జి వచ్చిందంటూ.. ఎమోషనల్ అయిన స్టార్ కమెడియన్

అణుకేంద్రాలపై అమెరికా దాడులు జరిపిన తర్వాత, ఇజ్రాయెల్‌పై ఇరాన్ మొత్తం 40 క్షిపణులు ప్రయోగించింది. అందులో ఖోర్రామ్‌షహర్-4 మిసైల్ కూడా ఉందని ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్షిపణి పరిధి 2,000 కిలోమీటర్లుగా ఉంది. ఏకంగా 1,500 కేజీల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదని తెలిపింది. విభిన్న వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలిగే సామర్థ్యాలు దీనికి ఉన్నాయని వివరించింది. 1980 దశకంలో ఇరాక్-ఇరాన్ యుద్ధ సమయంలో భారీ పోరాటానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ‘ఖోర్రామ్‌షహర్’ నగరం పేరును ఈ క్షిపణికి పెట్టినట్టు పలు కథనాలు పేర్కొన్నాయి. ఈ, మిసైల్‌ను ‘ఖైబార్’ అని కూడా పిలుస్తారు. 7వ శతాబ్దంలో స్వాధీనం చేసుకున్న యూదుల కోట పేరు మీదుగా ‘ఖైబార్’ అని పిలుస్తారు. ఈ కోట ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉంది.

Read this article- YSRCP: సింగయ్య నిజంగానే జగన్ కారు కిందపడి చనిపోయాడా.. వీడియోపై బోలెడన్ని డౌట్స్!

టెల్‌అవివ్‌లో భవనాలు ధ్వంసం
అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ జరిపిన దాడుల్లో 11 మంది ఇజ్రాయెలీ పౌరులు గాయపడినట్టు ఆ దేశ రక్షణ వర్గాలు తెలిపాయి. ఉత్తర టెల్ అవీవ్‌లోని ఒక పౌర నివాస ప్రాంతం కూడా ఇరాన్ దాడులకు ప్రభావితమైంది. ఒక షాపింగ్ సెంటర్, ఒక బ్యాంకు, ఒక సెలూన్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల దుకాణాలు దెబ్బతినగా, విరిగిన గేట్లు, వీధుల్లో గాజు పెంకులు కనిపించాయని ప్రభావిత ప్రాంతాల్లోని పౌరులు తెలిపారు. ఇరాన్ దాడిలో తన ఇంటి మొదటి అంతస్తు ధ్వంసమైందని, తన తల్లి ఇంటికి వెళ్లా్ల్సి వచ్చిందని ఓ వ్యక్తి వాపోయాడు. అదృష్టవశాత్తూ తనకు ఎలాంటి గాయాలు కాలేదని వివరించాడు. కాగా, ఇరాన్ క్షిపణుల ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఇజ్రాయెల్ భద్రతా సంస్థలు పరిశీలిస్తున్నాయి. కొన్ని వీధులను దిగ్బంధించి రోడ్లపై శిథిలాలను తొలగిస్తున్నారు. ఇందుకోసం యంత్రాలను ఉపయోగిస్తున్నారు. మరోవైపు, ఇజ్రాయెల్ కూడా కూడా ఇరాన్‌పై దాడులతో విరుచుకుపడింది. పెద్ద సంఖ్యలో మిసైళ్లు, డ్రోన్లను ప్రయోగించింది.

Read this article- Naga Chaitanya: సమంతను కలిసిన రోజు హగ్ ఇచ్చి అలా చేస్తానంటూ చైతూ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు