Naga Chaitanya: సమంత, నాగ చైతన్య గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు కన్నా.. విడిపోయాక ఎన్నో వార్తలు ఎక్కువయ్యాయి. అయితే సామ్, చైతూ ఎందుకు విడిపోయారో సరైన కారణం ఇంత వరకు బయటకు రాలేదు. వీరి మధ్య ముందు నుంచే గొడవలు జరిగాయని ఇండస్ట్రీలో కొందరు అంటున్నారు. అయితే, ఎవ్వరూ ఊహించని విధంగా ఈ జంట విడిపోయి అందరికి బిగ్ షాక్ ఇచ్చారు. అయితే, తాజాగా నాగ చైతన్య, సమంత గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే, ఈ వీడియో ఇప్పటిది కాదు. పాతదే అయినప్పటికీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అసలు చైతూ, సమంత గురించి ఏం చెప్పాడో ఇక్కడ తెలుసుకుందాం ..
నాగ చైతన్య, అమీర్ ఖాన్ కాంబోలో లాల్ సింగ్ చద్దా సినిమా వచ్చిన విషయం మనకీ తెలిసిందే. అయితే, ఆ సమయంలో నాగ చైతన్య యూట్యూబ్ ఛానెల్ కి పలు ఇంటర్వ్యూ లు ఇచ్చాడు. ఓ యాంకర్ చేతి మీద టాటూ గురించి అడగగా.. ఇది ఎప్పటికీ అలాగే ఉంచుకుంటాను అని చెప్పాడు. మీరు సమంతను మీట్ అయితే ఏం చేస్తారు అని అడగగా.. ముందు హాయ్ చెప్పి, హాగ్ ఇచ్చి మాట్లాడతాను అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అయితే, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీ మనసులో ఉన్నది ఎప్పటికైనా బయట పడుతుంది. ఏదొక రోజు మీరిద్దరూ కలిసి భోజనం చేస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రోజు సోషల్ మీడియాలో సామ్, చైతూకి సంబందించిన ఎన్నో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇటీవలే ఇంకో వార్త కూడా బయటకు వచ్చింది. తెలిసిన సమాచారం ప్రకారం నాగచైతన్య సమంతకు డివోర్స్ ఇవ్వక ముందే శోభితను బయట కలిసేవాడట. మొదటి నుంచే వీరి మధ్య రిలేషన్ ఉందని చెబుతున్నారు. కానీ, తెలిసిన సమాచారం ప్రకారం సామ్ తో విడాకులు అయ్యాకే శోభితను కలిశాడని అంటున్నారు. అయితే, ఈ వార్తలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు