Kajal Agarwal : స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, తాజాగా ఈ ముద్దుగుమ్మ కి సంబందించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. నిజంగానే కాజల్ ఆ స్టార్ హీరో తో ఎఫైర్ పెట్టుకుందా? వీరిద్దరూ 10 ఏళ్లు రిలేషన్ లో ఉన్నారంటూ ఓ వార్త బయటకు వచ్చింది. కాజల్ అగర్వాల్ డీప్ గా ప్రేమించిన ఆ హీరో ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..
కాజల్ అగర్వాల్ కరోనా సమయంలో బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లూ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. పెళ్ళైన కొద్ది రోజులకు ఈ విషయం బయట పడింది. అయితే, గౌతమ్ కిచ్లూ కంటే ముందే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ హీరోని 10 ఏళ్ల పాటు ప్రేమించందని సినీ వర్గాల నుంచి సమాచారం. ఆ హీరో ఎవరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్.
Also Read: Tollywood: 40 ఏళ్లు దాటిన తెలుగు హీరోతో పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. కొత్త జంట ఫొటోలివే
ఆ ఇష్టంతోనే కాజల్ మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం చేసింది?
కాజల్, ప్రభాస్ కాంబోలో వచ్చిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి రెండు చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే, డార్లింగ్ మూవీ నుంచి ప్రభాస్ పై ప్రేమ పెంచుకొని ఒక రోజు వెళ్ళి ప్రపోజ్ చేసిందని తెలిసిన సమాచారం. కానీ, ప్రభాస్ మాత్రం కాజల్ ని ఒక ఫ్రెండ్ లాగే ట్రీట్ చేశాడట. ఇక, ఆ ఇష్టంతోనే కాజల్ మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కూడా ఒప్పుకుంది.
Also Read: Banakacherla: బనకచర్ల డైవర్షన్ డ్రామా! శ్రీశైలం బ్యాక్ వాటర్ దోపిడీపై చర్చ లేకుండా డ్రామాలు!
కాజల్ ని రిజెక్ట్ చేసిన ప్రభాస్?
ఆ ప్రేమను అలాగే దాచుకుని 10 ఏళ్ల తర్వాత ప్రభాస్ కి లవ్ ప్రపోజల్ చేయగా.. సారీ, ఏం అనుకోవద్దు.. నేను నిన్ను ఫ్రెండ్ గానే చూశాను. లవర్ గా ఎప్పుడూ అనుకోలేదంటూ ప్రభాస్ ఏం ఆలోచించకుండా రిజెక్ట్ చేశాడట. డార్లింగ్ రిజెక్ట్ చేయడంతో వెంటనే, తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుంది.
Also Read: Abhishek Bachchan: ఐశ్వర్య రాయ్‌తో విడాకులు.. సింగిల్ గా ఉండాలనిపిస్తోందంటూ అభిషేక్ బచ్చన్ పోస్ట్?