Abhishek Bachchan: బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి అమితాబ్ బచ్చన్ తెలుగు సినిమాల్లో కూడా నటించడంతో తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు. బిగ్ బి అమితాబ్ నట వారసుడుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అభిషేక్ తండ్రి సపోర్ట్ లేకుండా కేవలం తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.
ఐశ్వర్య రాయ్‌కు విడాకులు ఇవ్వబోతున్నాడా?
మిస్ వరల్డ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలం నుంచి అభిషేక్, ఐశ్వర్య డివోర్స్ తీసుకుంటున్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి ఓ పెళ్లిలో మెరవడంతో ఈ వార్తలు ఆగాయి. అయితే, మళ్లీ ఏం జరిగిందో తెలీదు. ఇన్స్టా వేదికగా అభిషేక్ పెట్టిన పోస్ట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Janhvi Kapoor: చేయి పట్టుకుని.. లండన్‌లో లవర్‌తో ఛిల్ అవుతోన్న జాన్వీ కపూర్.. పక్కనే చెల్లి కూడా?
సడెన్ గా అభిషేక్ ఇలాంటి పోస్ట్ ఎందుకు పెట్టాడు?
కొన్ని రోజులు అన్ని వదిలేసి దూరంగా ఉంటానంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టని అభిషేక్.. బుధవారం రోజు ఇలాంటి పోస్ట్ పెట్టడంతో అందర్ని షాక్ కి గురి చేసింది. అభిషేక్ పెట్టిన పోస్టులో కొన్ని రోజులు అన్నిటికి.. అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నా.. ముఖ్యంగా ప్రజలకు దూరంగా ఉంటూ నాకు నేను దగ్గరగా ఉండాలనుకుంటున్నాను.. నాకు ఇష్టమైన వాళ్ళ కోసం ఉన్నదంతా ఇచ్చేసా.. ఇప్పుడు నాతో నేను ఉంటాను.. దాని కోసం నా టైం నాకే కావాలంటూ పోస్టును పెట్టాడు.
Also Read: CM Revanth Reddy: డిజిటల్ యుగంగా ప్రపంచం.. నైపుణ్యాల పెంపునకు స్కిల్ వర్సిటీ ఏర్పాటు!