Bigg Boss 9 Telugu: తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్(Bigg Boss) షోకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే, దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే, ఇప్పటి వరకు విజయవంతంగా 8 సీజన్లను పూర్తి చేసుకుని 9 వ సీజన్ కి రెడీ అవుతోంది. కంటెస్టెంట్లని వెతికే పనిలో బిగ్ బాస్ టీమ్ బిజీగా ఉన్నారు. అలాగే, ఈ షోకి సంబంధించిన సెట్ నిర్మాణ పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సారి బిగ్ బాస్ ఇంట్లోకి ఎవరెవరు వెళ్తున్నారు? ఎలాంటి కంటెస్టెంట్లని సెలెక్ట్ చేశారు? అనేది హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ 8 కి ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు.
Also Read: Naga Chaitanya: సమంతను కలిసిన రోజు హాగ్ ఇచ్చి అలా చేస్తానంటూ చైతూ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్
గత సీజన్ అంతకి మించి అంటూ .. కొత్త రూల్స్ తో మన ముందుకు వచ్చారు కానీ, ఆశించిన స్థాయిలో రేటింగ్ రాలేదు. అయితే, ఈ సారి ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు ముందు నుంచే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ టీం తొమ్మిదో సీజన్‌కి ఊహించలేని కంటెస్టెంట్లని దించబోతున్నట్టు టాక్ నటుస్తుంది. దానిలో భాగంగానే కొందరి పేర్లు బయటకు వచ్చాయి. వాళ్ళ పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే, వారిలో అదిరిపోయే స్టార్స్ కూడా ఉన్నారు.
Also Read: Tollywood: 40 ఏళ్లు దాటిన తెలుగు హీరోతో పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. కొత్త జంట ఫొటోలివే
మై విలేజ్ షో ద్వారా పేరు తెచ్చుకున్న అనిల్ గీల(Anil Geela), గోరింటాకు సీరియల్ యాక్టర్ కావ్య(Kavya), రీతు చౌదరి(Reethu Chowdary), ప్రదీప్(Pradeep), జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్(Emmanuel), అమెరికా అమ్మాయి సీరియల్ యాక్టర్ సీతాకాంత్(Seetha Kanth), బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపిక(Deepika), మౌనరాగం సీరియల్ ఫేమ్ శివ్ కుమార్(Shiv Kumar), అలేఖ్య చిట్టి పికిల్స్ అలేఖ్య(Alekhya) , అమర్ తేజ్ వైఫ్ తేజస్విని గౌడ(Tejaswini Gowda), ఎన్నోన్నో జన్మల బంధం సీరియల్ హీరోయిన్ దేబ్‌జాని(Debjani), కేరింత హీరో సుమంత్ అశ్విన్(Sumanth Ashwin), సీరియల్ యాక్టర్స్ హారిక(Harika), ఏక్‌నాథ్(Eknadh)ల పేర్లు లీక్ అయ్యాయి. మరి, వీరిలో ఎవరు బిగ్ బాస్ లోకి వెళ్తారో తెలియాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాలి.