International News Bird Flu Death Case In New Strain Mexico
అంతర్జాతీయం

Bird Flue: దడ పుట్టిస్తున్న బర్డ్‌ప్లూ, తొలి మరణం: WHO

International News Bird Flu Death Case In New Strain Mexico: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. దాని బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో మళ్లీ బర్డ్‌ప్లూ రూపంలో ప్రపంచానికి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. అంతేకాకుండా అందరికి దడ పుట్టించే లేటెస్ట్ న్యూస్ తెలిపింది. బర్డ్‌ ప్లూ కారణంగా తొలి మరణం మెక్సికో దేశంలో సంభవించింది. హెచ్5 ఎన్2 బర్డ్ ఫ్లూ వేరియంట్ బారినపడ్డ స్థానికుడు ఒకరు ఇటీవల మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ధ్రువీకరించింది.

జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, విరేచనాలు, కడుపులో తిప్పడం తదితర సమస్యలతో బాధపడ్డ రోగి ఏప్రిల్ 24న కన్నుమూశాడు. బాధితుడు బర్డ్ ఫ్లూ బారినపడ్డ విషయాన్ని మెక్సికో అధికారులు మే 23న ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించారు.రోగికి వ్యాధి ఎలా సోకిందనే దానిపై సమాచారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే మెక్సికోలోని కోళ్లల్లో హెచ్5 ఎన్2 ఇన్ఫెక్షన్లు వెలుగు చూసినట్టు పేర్కొంది. మరి కోళ్ల నుంచి మనిషికి ఈ వ్యాధి ఎలా వ్యాపించిందో నిర్ధారించడం కష్టంగా మారిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

Also Read: ఎయిర్‌షో కార్యక్రమంలో గాల్లో కలిసిన ప్రాణం

ఇప్పటివరకూ ఈ వేరియంట్ మనుషులకు సోకడం దాదాపు అసాధ్యంగా భావించినట్టు పేర్కొంది. మరోవైపు, అమెరికాలో బర్డ్ ఫ్లూకు చెందిన మరో వేరియంట్ వ్యాపిస్తోంది. పశువుల్లో ఈ వ్యాధి ప్రబలుతున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. కొందరు మనుషులు కూడా దీని బారినపడ్డట్టు తెలుస్తోంది. అయితే ఇది రోగుల నుంచి ఇతరులకు వ్యాపిస్తోందనేందుకు ఇంతవరకూ ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని అధికారులు పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే రోగి మరణం అనంతరం ప్రపంచంలోని అన్ని దేశాలను అలర్ట్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?