Accident In Air Show Pilot Died When Planes Collided In The Wind
అంతర్జాతీయం

Air Show: ఎయిర్‌షో కార్యక్రమంలో గాల్లో కలిసిన ప్రాణం

Accident In Air Show Pilot Died When Planes Collided In The Wind: పోర్చుగల్‌ దేశంలో ఊహించని విషాదకర ఘటన జరిగింది. దక్షిణ పోర్చుగల్‌లో జరుగుతున్న ఎయిర్‌షో కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. గాల్లో రెండు విమానాలు ఉండగానే ఒకదానినొకటి ఢీకొన్న కారణంగా ఓ విమానం నడిపే పైలట్‌ మృతి చెందాడు.

ఇక అసలు వివరాల్లోకి వెళితే..దక్షిణ పోర్చుగల్‌లోని బెజాలో ఎయిర్‌షో జరుగుతోంది. ఈ ఎయిర్‌ షో కార్యక్రమంలో మొత్తం ఆరు విమానాలు తమ ప్రతిభని ప్రదర్శించేందుకు గాల్లో విన్యాసాలు చేస్తున్నాయి. కాగా. ఆదివారం ఎయిర్‌షో సందర్భంగా ఒక విమానం వేగంగా పైకి దూసుకెళ్లి మరోదాన్ని ఢీకొట్టింది. దీంతో రెండూ ఒక్కసారిగా కింద కుప్పకూలాయి. ఒకటి ఎయిర్‌బేస్‌కు అవతల పడిపోగా మరొకటి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో స్పెయిన్‌కు చెందిన పైలట్‌ మృతిచెందాడు. మరో పైలట్‌ పోర్చుగల్‌కు తీవ్రగాయాలయ్యాయి.

Also Read:శృంగార తార కేసులో ట్రంప్‌ దోషి

ఇక పోర్చుగల్‌, స్పెయిన్‌కు చెందిన పైలట్లతో కూడిన యాక్‌ స్టార్స్ అనే ఏరోబాటిక్‌ గ్రూప్‌ ఈ వైమానిక విన్యాసాలను ప్రదర్శిస్తోంది. వీటిలో పాల్గొన్న విమానాలన్నీ యాకోవ్లెవ్ యాక్ 52 రకానికి చెందినవి. కాగా ఈ ఘటనపై విచారణ జరిపి ప్రమాదానికి దారితీసిన కారణాలేంటో గుర్తిస్తామని పోర్చుగల్‌ రక్షణమంత్రి నునో మెలో తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.