Monday, October 14, 2024

Exclusive

International :ఛాన్స్ ఇస్తే మారణహోమం ఆపేస్తా

  • రష్యా -ఉక్రెయిన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
  • ఎంతమాత్రం సాధ్యం కాదంటున్న రష్యా
  • ఉక్రెయిన్ సమస్య ఒక్క రోజుతో పరిష్కారమయ్యేది కాదన్న రష్యా
  • బలమైన అధ్యక్షుడు ఉంటే యుద్ధం జరిగేది కాదన్న ట్రంప్
  • ట్రంప్‌ వ్యాఖ్యలపై స్పందించిన రష్యా రాయబారి వాసిలీ నెబెంజాస్

Trump says he can end the Russia Ukraine war in one day If given chance

తాను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపేస్తానని డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఈ విషయాన్ని ఆయన ఇటీవల తన ప్రచార కార్యక్రమాల్లో పదే పదే చెబుతున్నారు. రష్యా మాత్రం అది సాధ్యం కాదని వాదిస్తోంది. ఉక్రెయిన్‌ సంక్షోభం ఒక్కరోజులో పరిష్కరించదగిన అంశం కాదని తెలిపింది.యుద్ధంలో రష్యన్లు, ఉక్రెయిన్లు వేలాది మంది మరణిస్తున్నారని 2023 మేలో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్‌ తొలిసారి అన్నారు. తనకు అవకాశం లభిస్తే ఈ మారణహోమాన్ని ఆపేస్తానన్నారు. కేవలం 24 గంటల్లో నిలువరించే సామర్థ్యం తనకు ఉందని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ఆయన తాజా ప్రచార కార్యక్రమాల్లో పదే పదే వల్లెవేస్తున్నారు. గతవారం అధ్యక్షుడు బైడెన్‌తో జరిగిన చర్చలోనూ దీని ప్రస్తావన వచ్చింది. అమెరికాలో గనక బలమైన అధ్యక్షుడు, పుతిన్‌ గౌరవం పొందగలిగే వ్యక్తి ఉండి ఉంటే అసలు ఉక్రెయిన్‌పై యుద్ధం జరిగేదే కాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం కావటంతో ట్రంప్‌ వ్యాఖ్యలపై ఐరాసలోని రష్యా రాయబారి వాసిలీ నెబెంజా తాజాగా స్పందించారు.

సుప్రీంకోర్టులో ట్రంప్‌నకు ఉపశమనం

ఏప్రిల్‌ 2022లో ఇస్తాంబుల్‌లో రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఒప్పందం దాదాపు ఖరారు దశకు చేరిందని నెబెంజా వెల్లడించారు. అది సఫలీకృతమైతే యుద్ధం అప్పుడే ముగిసి ఉండేదని తెలిపారు. కానీ, ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న పాశ్చాత్య దేశాలే ఆ ఒప్పందాన్ని చెడగొట్టాయని ఆరోపించారు. రష్యాతో పోరాటం కొనసాగించాలని కీవ్‌ను ఎగదోశారని పేర్కొన్నారు. అవన్నీ మర్చి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పుడు ‘శాంతి ఒప్పందం’ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.

ఉక్రెయిన్ కాల్పుల విరమణకు ముందుకు రావాలి

పుతిన్‌ ప్రతిపాదించినట్లుగా ఉక్రెయిన్‌ వెంటనే కాల్పుల విరమణకు ముందుకు రావాలని నెబెంజా అన్నారు. 2022లో రష్యా ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఆ దేశ బలగాలను ఉపసంహరించుకోవాలని సూచించారు. పాశ్యాత్య దేశాల సైనిక కూటమి నాటోలో చేరబోమని హామీ ఇవ్వాలని తెలిపారు. అప్పుడే యుద్ధం ముగింపు దిశగా బాటలు పడతాయని అభిప్రాయపడ్డారు. పుతిన్‌ ప్రతిపాదనను జెలెన్‌స్కీ తిరస్కరించిన విషయం తెలిసిందే. తమ భూభాగాన్ని పూర్తిగా అప్పగించాల్సిందేనని పట్టుబట్టారు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

International news:కిమ్ అరాచకం

దక్షిణ కొరియా పాటలు విన్నాడని బహిరంగంగా ఉరి మితిమీరిపోయిన కిమ్ నియంతృత్వ ధోరణి దక్షిణ హ్వాంగ్‌హే ప్రావిన్స్‌‌‌కు చెందిన వ్యక్తికి కఠిన శిక్ష శతృదేశాలకు చెందిన సినిమాలు, పాటలపై నిషేధం మానవహక్కుల...

International: భారతీయులూ.. బయటకు రావద్దు

అలర్ట్ జారీ చేసిన కెన్యా లోని భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖ పన్నుల పెంపునకు నిరసనగా కెన్యాలో దేశవ్యాప్త ఆందోళనలు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతున్న ఆందోళనలు పార్లమెంట్ ప్రాంగణంలో మిన్నంటిన గొడవలు ...

International news:రష్యాలో ‘ఉగ్ర’దాడి

More than a 15 killed in synagogue church attacks in Russia’s Dagestan: యూదులు, క్రైస్తవుల ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా రష్యాలో సౌత్ ప్రావిన్స్ డాగేస్థాన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అత్యంత...